Begin typing your search above and press return to search.

కొత్త కబుర్లు చెబుతున్న ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   29 July 2016 6:55 AM GMT
కొత్త కబుర్లు చెబుతున్న ఎమ్మెల్యే
X
ఒక భాషలో మూడేళ్లలో ఆరు సినిమాలు.. ఏ హీరోయిన్ కయినా ఎంత క్రేజ్ ఉందో చెప్పేందుకు ఈ ఫిగర్ చాలు. కానీ ఆరో సినిమా వరకూ సరైన బ్రేక్ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మూడేళ్ల ఎదురుచూపుల తర్వాత కేథరిన్ థ్రెసాకు సరైనోడుతో ఆశించిన బ్రేక్ వచ్చింది. కేరక్టర్ల ఎంపికలో ప్రత్యేకత చూపించే ఈ మలయాళీ భామ.. ప్రతీ మూవీతో నటిగా ఎదుగుతున్నాగా అంటోంది.

'నన్ను ఎగ్జైట్ చేసే పాత్రలు సినిమాలు మాత్రమే ఎంచుకుంటా. లేకపోతే నా మనసు ఆ సినిమాపై లగ్నం కాదు. బాగా లిమిటెడ్ స్కోప్ ఉన్న రోల్స్ చేయాలని అనిపించదు. నేచురల్ గా ఉండే పాత్రలకు త్వరగా కనెక్ట్ అవుతా' అంటున్న కేథరిన్.. 'నేను ఎప్పటి లైఫ్ ని అప్పుడే తీసుకునే టైపు. ఇవాల్టి కోసమే బతుకుతా. రేపటి గురించి ఎక్కువగా ఆలోచంచను' అని చెప్పడం విశేషం.ఈ మలయాళీ ముద్దుగుమ్మకు బుక్స్ అంటే మహా పిచ్చి. విపరీతంగా చదివేస్తుందని సస్నిహితులు చెబుతూ ఉంటారు.

'విపరీతంగా చదువుతానో లేదో తెలీదు కానీ.. పుస్తకాలు చదువుతాను. ఆవి నా ఊహా శక్తికి మరింత పెంచుతాయి' అంటోంది సరైనోడి ఎమ్మెల్యే. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ సరసన ఓ సినిమా.. తేజ దర్శకత్వంలో రానాకి జంటగా ఓ సినిమా చేస్తోంది కేథరిన్.