యాపిల్ పిల్ల బిగ్ డీల్

Wed Jan 16 2019 14:32:01 GMT+0530 (IST)

ఎ ఫర్ యాపిల్.. పి ఫర్ పామోలివ్! అంటోంది కేథరిన్ థ్రెస్సా. ఈ బ్యూటీ గత కొంతకాలంగా టాలీవుడ్ సర్కిల్స్ లో కనిపించకపోయినా కెరీర్ పరంగా ఖాళీగా ఏం లేదు. ఓవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంటూనే కథానాయికగానూ అడపా దడపా అవకాశాలు అందుకుంటోంది.



కేథరిన్ ప్రస్తుతం తమిళం - మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. తదుపరి `వంత రాజవథాన్ వరువేన్` (అత్తారింటికి దారేది రీమేక్) రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో సింబు కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పామోలివ్ బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది.

అందుకు సంబంధించిన టీవీ కమర్షియల్ ఇప్పటికే చిత్రీకరించారు. ఇందులో కేథరిన్ అందచందాల ఎలివేషన్ వీక్షకుల మతి చెడగొడుతోంది. తడిపొడి అందాలతో ఈ అమ్మడు గుబులు రేకెత్తిస్తోంది. ఇకపోతే `సరైనోడు` చిత్రంలో ఎమ్మెల్యగా అలరించిన కేథరిన్ అటుపైనా బోయపాటి తెరకెక్కించిన జయ జానకి నాయికలో `ఏ ఫర్ యాపిల్...` అంటూ వేడెక్కించే ఐటెమ్ నంబర్ లో నర్తించింది. మల్లూ వుడ్ లోనూ వేడెక్కించే పలు చిత్రాల్లో నటిస్తోంది అమ్మడు.