Begin typing your search above and press return to search.

బికినీలో క్యాథరీన్ మొహమాట పడలే

By:  Tupaki Desk   |   28 July 2017 9:43 AM GMT
బికినీలో క్యాథరీన్ మొహమాట పడలే
X
మామూలుగా ఎవరన్నా పెద్ద హీరోయిన్ బికినీ వేస్తోంది అంటే.. ఆ షాట్ గురించి నానా రచ్చా ఉంటుంది. ఫర్ సపోజ్ సూర్య సరసన 'సికందర్' సినిమాలో టూ పీస్ బికినీ వేసింది సమంత. అయితే ఈ సీన్ ను ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేలా పెట్టారు. తీయడానికి చాలా యాంగిల్స్ లో చాలా షాట్స్ తీశారు కాని.. వాటి నిడివిని పూర్తిగా తగ్గించేసి.. ఏదో మెరుపుతీగ అలా వెళ్ళినట్లు మార్చేశారు. అందుకే ఇప్పుడు 'గౌతమ్ నంద' సినిమాలో క్యాథరీన్ త్రెసా బికినీ వేస్తోందంటే జనాలకు పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు. కాని అమ్మడు మాత్రం పిచ్చెత్తించింది తెలుసా!!

హీరో ఊహించుకుంటున్నట్లు ఒకసారి.. అలాగే నిజంగా జరుగుతున్న సీన్లో అన్నట్లు ఒకసారి.. ఒక బికినీలో రెండుసార్లు మెరిసింది క్యాథరీన్. నల్ల రంగు సింగిల్ పీస్ బికినీలో అమ్మడు అలా వయ్యారంగా స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వస్తుంటే.. అబ్బో రసవత్తరంగా ఉంది. పైగా షాట్ నిడివి కూడా చాలా ఎక్కువ ఉండటంతో.. గ్లామర్ లవ్వర్లు ధియేటర్లోనే దసరా దీపావళి జరుపుకున్నారు. మామూలుగా ఇతర హీరోయిన్లు మొహమాటపడి బికినీ సీన్ లెంగ్త్ కట్ చేయిస్తారు కాని.. క్యాథరీన్ మాత్రం అస్సలు తగ్గలేదు.. తగ్గించమని అగడలేదు. ఈ బికినీ లుక్ తో క్యాథరీన్ ఈ మధ్యకాలంలో ఇలియానా తరువాత అంత లెంగ్తీ బికినీ స్టంట్ చేసిన హీరోయిన్ గా చరిత్రకెక్కనుంది.

ఇకపోతే ప్రతీ సినిమాలో క్యాథరీన్ ను సెకండ్ హీరోయిన్ గా చూసి చూసి బోరు కొడుతోంది. ఖచ్చితంగా ఆమె రేంజ్ అందానికి.. ఆ కత్తిలాంటి లుక్స్ కు.. మన స్టార్ హీరోయిన్లకు అందరూ చేసే షుమారు నటనే వచ్చుండటం.. ఈమెను ఈపాటికే స్టార్ హీరోయిన్ ను చేయాలి. చూద్దాం ఈ సినిమా తరువాత ఈమె ఫేట్ ఎలా మారబోతోందో!!