Begin typing your search above and press return to search.

లాభం లేదని బికినీలోకి దిగేసిందా?

By:  Tupaki Desk   |   26 July 2017 9:46 AM GMT
లాభం లేదని బికినీలోకి దిగేసిందా?
X
తెలుగు సినిమా పై అందాలు అరబోత చేసే హీరోయిన్లుకు కొదవ ఏమి లేదు కాని ఈ మధ్య ఈ అందాలు ఆరబోతకు మంచి పోటీ ఏర్పడింది. వస్తున్న కొత్త హీరోయిన్లు అందరూ గ్లామర్ పాత్రలుకు స్కిన్ షో చేయడానికి వెనకడటంలేదు. పొట్టి బట్టలు రోజులు పోయి బికినీ అందాలు తో అలరించే రోజులు వచ్చాయి ఇప్పుడు. మన హీరోయిన్లు కూడా బికినీ వేసుకొని కనిపించడానికి రెడీ అయ్యారు. బికినీ అనే పదం ఇప్పుడు కమర్షియల్ సినిమా మార్కెట్ లో ముఖ్యమైన విషయం. అలా హీరోయిన్ని బికినీలో చూసి అందాన్ని ఆరాదించే అభిమానులు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి అభిమానులు కోసం ఒక కొత్త అందం సిద్దం చేస్తున్నారు సంపత్ నంది.

గోపి చంద్ హీరోగా హన్సిక - క్యాథరీన్ త్రెసా హీరోయిన్లు గా నటిస్తున్న గౌతమ్ నంద సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నాడు. కొద్ది రోజులు కిందట హన్సిక్ గోపిల పై ఒక రొమాంటిక్ పాట షూట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అందం క్యాథరీన్ త్రేసా తో ఒక బికినీ పాట చేశారు అంట. అతి తక్కువ కాలంలోనే తన పరువాలుతో తెలుగు వాళ్ళకి దగ్గరైన ఈమె ఇప్పుడు గౌతమ్ నంద సినిమాలో మరింత సెక్సీ గా కనిపించబోతుంది అని చెబుతున్నారు. ఒక పాటలో తన తడిసిన అందాలు తో సెక్సీ బికినీతో అందరిని మైకంలో పడేస్తుందట. ఇప్పటికే తన మత్తు చూపులతో సెక్సీ లుక్కులతో క్యాథరీన్ ఎంత ప్రయత్నించినా కూడా పెద్దగా ఫలితాలు రాలేదు. అందుకే ఇప్పుడు బికినీకి సై అనేసిందట. ఈ దెబ్బ తో క్యాథరీన్ ఇమేజ్ ఇంకా ఎలా మరాబోతుందో ఆమె కెరియర్ గ్రాఫ్‌ ఏమన్నా పైకెక్కుతుందా? లెటజ్ సీ.

ఇక సంపత్ నంది కూడ అందాన్ని చూపించడంలో మంచి చేవనే చూపిస్తాడు. తొలి సినిమా నుండి ఇప్పటివరకు హీరోయిన్లతో వేడైన ఎక్సపోజింగ్.. అలాగే వాన పాటల్లో వారితో గ్లామర్ ను దారబోయించడం.. మనోడి స్పెషాలిటి. ఇవన్నీ గౌతమ్ నందకు కలిసొస్తాయా రావా? ఇలాంటివి ఎన్నున్నా కూడా కంటెంట్ ఉంటేనే బాసూ!!