ఆ డ్రెస్సేంటి కేథరిన్!?

Mon Jul 17 2017 22:19:44 GMT+0530 (IST)

స్టైలింగ్.. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. గతంలో మోడల్స్.. సినిమా స్టార్స్.. ఎవరికి తగ్గట్లుగా వారు మెయింటెయిన్ చేసేవారు కానీ.. ఈ మధ్య కాలంలో రెండు దాదాపు ఒకటిగా కలిసిపోయాయి. దీంతో పోటీ తత్వం కూడా బాగానే పెరిగిపోయింది. అందుకే అందాల భామలు తమకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకునేందుకు.. స్టైలింగ్ స్టేట్మెంట్ ఇచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.కేథరిన్ థ్రెసా.. రీసెంట్ గా 'గౌతమ్ నంద' ఆడియో ఫంక్షన్' కి ప్రత్యేకమైన డ్రెసింగ్ తో హాజరైంది. సహజంగా అందాలను చూపించేందుకు భామలు ఉత్సాహం చూపిస్తుంటారు కానీ.. కేథిరన్ మాత్రం మొత్తం కప్పేసుకుని అందంగా కనిపించడంలో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నించింది. మిలమిలా మెరుస్తున్న డ్రెస్ కలర్ బాగుంది కానీ.. డ్రెసింగ్ మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా.. కాలి చుట్టూ రౌండ్ పరిచినట్లుగా చేసుకువచ్చిన డ్రెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకు తగ్గట్లుగానే మేకప్ విషయంలో కూడా పూర్తి స్థాయి ఫోకస్  పెట్టకపోవడం కూడా.. అమ్మడి అందాల మెరుపులను తగ్గించేసింది.

మొత్తం మీద బ్యాడ్ డ్రెసింగ్ అనే కామెంట్స్ బాగానే వినిపించాయి. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల సంఖ్య బాగా తగ్గించుకున్న ఈ భామ.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతోంది. ఖైదీ నంబర్ 150లో ఐటెం సాంగ్ ఆఫర్ మిస్ చేసుకున్నా.. తేజ డైరెక్షన్ లో రానా హీరోగా రూపొందిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మళ్లీ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తోంది. కానీ.. ఈ చిత్రంలో కేథరిన్ పాత్రను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.