క్యాథరీన్ కు అంతా? ఓవరే!!

Mon Mar 20 2017 13:35:25 GMT+0530 (IST)

అసలు కొంతమంది నిర్మాతలు హీరోయిన్లు లేదా హీరోల రేట్ కార్డును పెంచడానికే ఇండస్ర్టీలో ఉన్నారని అనిపిస్తుంటుంది. ఆ మాటల్లో కూడా నిజం లేకపోలేదు. అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్టు లేని హీరోలకూ హీరోయిన్లకూ కేవలం స్పెషల్ పాత్రలు చేశారనో.. లేదంటో ఐటెం సాంగులో మెరిశారనో మనోళ్ళు బీభత్సంగా సమర్పించుకుంటున్నారు. అదిగో ఇప్పుడు క్యాథరీన్ కు ఎంతిచ్చారో చూస్కోండి మరి.

దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆల్రెడీ రకుల్ ప్రీత్ అండ్ ప్రగ్యా జైస్వాల్ లు హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎడిషనల్ కిక్ నింపడానికి మన దర్శకుడు ఇప్పుడు క్యాథరీన్ త్రెసాతో ఒక ఐటెం సాంగ్ చేయిస్తున్నాడు. ఈ పాట కోసం అక్షరాలా 60 నుండి 65 లక్షల రూపాయల వరకు క్యాథరీన్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. నిజానికి ఒక ఫుల్ లెంగ్త్ సినిమా చేసినా కూడా క్యాథరీన్ కు కనీసం 30 లక్షలు రెమ్యూనరేషన్ లేని టైములో.. ఇలా 60 చేతిలో పెట్టి ఐటెం చేయించుకుంటున్నారంటే.. అసలు మనోళ్లను ఒక రేంజ్ లో అభినందించాల్సిందే.

చేతిలో సినిమాలో లేనప్పుడు ఇదే విధంగా ఒక నిర్మాత అత్యుత్సాహంతో కాజల్ కు 2 కోట్లు ఇచ్చాడు. అలాగే తమన్నా కు కూడా మార్కెట్ కు మించి డబ్బులు చేతిలోపెట్టారు. అందుకే వారికి హిట్లు తక్కువగా ఉన్నప్పటికీ భారీ పైకం అందింది. ఇప్పుడు క్యాథరీన్ ను కూడా అటుగానే నడిపించేలా ఉన్నారే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/