Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 3కి క్యాస్టింగ్ కౌచ్ సెగలు

By:  Tupaki Desk   |   15 July 2019 5:26 AM GMT
బిగ్ బాస్ 3కి క్యాస్టింగ్ కౌచ్ సెగలు
X
ఏదో ఒక వివాదం లేనిదే సాగని బిగ్ బాస్ షో ఈసారి మూడో సీజన్ మొదలుకాకుండానే వాటిలో దిగిపోయింది. ఈ శనివారం నాగార్జున హోస్ట్ స్టార్ట్ అయ్యే కొత్త సిరీస్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎంత కాంట్రోవర్సి ఉన్నా చూసేవాళ్ళకు కొదవలేదు కాబట్టి స్టార్ మా ఛానల్ స్టార్లను యాంకర్లుగా తీసుకురావడంలో రాజీ పడటం లేదు. ఇకపోతే ఈ షో పార్టిసిపెంట్స్ సెలక్షన్ లో క్యాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులు ఉన్నాయని ఓ నటి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాక ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సంచలనం రేపింది.

దీని వల్ల ఇప్పటికిప్పుడు షో ఆగేంత సీన్ అయితే ఉండకపోవచ్చు. ఆరోపణలకు తగ్గ ఆధారాలు చూపించినప్పుడే ఏదైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేవలం నోటి మాట ఇచ్చే ఫిర్యాదుకు సాక్ష్యాలు సేకరించడం అంత ఈజీ కాదు. సో బిగ్ బాస్ 3 ఓపెనింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేనట్టె. ఇన్ని రోజులు లేనిది ఇలాంటి వివాదాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న జనంలో సహజంగానే కలుగుతోంది. పబ్లిక్ అటెన్షన్ తీసుకోవడం కోసమా అనే డౌట్లు లేకపోలేదు.

కాని ఇన్ సైడ్ టాక్ ప్రకారం ముందు బిగ్ బాస్ షోలో అవకాశం ఇస్తామని చెప్పి తర్వాత నో చెప్పించుకున్నవాళ్ళే ఇప్పుడీ రివర్స్ గేమ్ ఆడుతున్నారని చెబుతున్నారు. ఏది నిజమో ఏది అబద్దమో చెప్పడం కష్టం కాని మొత్తానికి బిగ్ బాస్ 3 ఈసారి కూడా రచ్చ చేసేలా ఉంది. కొసమెరుపు ఏంటంటే ఇదే షో కోసం టాక్సీ వాలా హీరొయిన్ ప్రియాంక జవల్కర్ ని అడిగారట. ముందు పాజిటివ్ గా ఆలోచించినా తర్వాత కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఆఫర్స్ మిస్ అవ్వొచ్చనే ఉద్దేశంతో ఫైనల్ గా నో చెప్పిందట. హౌస్ లో ఉండే 15 మంది ఎవరో ఇంకో రెండు మూడు రోజుల్లో పక్కాగా లీకయ్యే ఛాన్స్ ఉంది