Begin typing your search above and press return to search.

నాని కారు కోసం ఆరు నెలలు వెతికారంట

By:  Tupaki Desk   |   7 Feb 2016 11:30 AM GMT
నాని కారు కోసం ఆరు నెలలు వెతికారంట
X
సినిమాలకు కాంబినేషన్స్ చాలా ముఖ్యమనే విషయం మనకి తెలుసు. పర్ఫెక్ట్ పెయిర్ - కాస్టింగ్ కోసం నెలల తరబడి టైం వెచ్చించాల్సి వస్తుంది. ఒక్కోసారి స్క్రిప్ట్ డిమాండ్ చేసిందంటూ ఏళ్లపాటు ఎదురుచూసిన దాఖలాలు కూడా ఉంటాయి. కానీ నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలో.. ఓ కారు కోసం 6 నెలలు వెతికారట యూనిట్.

సినిమా సెకండాఫ్ రన్నింగ్ లో కారుకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎక్కువ సేపు కారుతో ముడి పడి ఉంటుంది స్క్రీన్ ప్లే. అందుకే స్టోరీ తగ్గట్లుగా ఉండే కారు కోసం చాలా రీసెర్చ్ చేశాడు డైరెక్టర్ హను రాఘవపూడి. చివరకు 1959కి చెందిన డాడ్జ్ సీ కార్ ని ఫైనల్ అయ్యారు. ఇది బెంగళూరులోని ఓ రాజ కుటుంబీకుల దగ్గర పాడైపోయిన స్థితిలో కనిపించింది. ఎట్టకేలకు వాళ్ల ఒప్పించి, దాని మీద పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేశారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల టీం. చివరకు అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించి రిపేర్లు కూడా కంప్లీట్ చేసి ఎట్టకేలకు నడిపించారు ఆ కారుని.

ఈ రిపేర్ల కోసమే 35 రోజులు పట్టిందట. ఇంత టైం తీసుకున్నా.. పర్ ఫెక్ట్ లుక్ కోసం తప్పలేదని చెబ్తున్నాడు డైరెక్టర్. ఎంతో ప్రతిష్టాత్మకగా రూపొందించిన ఈ కృష్ణగాడి వీర ప్రేమగాధ ఈనెల 12న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తర్వాత నాని చేస్తున్న మూవీ కావడంతో.. చాలానే అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి.