Begin typing your search above and press return to search.

ట్రైలరే ఆ రేంజిలో ఉంటే..

By:  Tupaki Desk   |   28 Nov 2015 3:30 PM GMT


'కెప్టెన్ అమెరికా సివిల్ వార్'.. ఇంకా విడుదల కాని ఈ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సినిమా విడుదలకు ముందు విడుదల చేసే ట్రయిలరే రికార్డులు సృష్టిస్తుండడంతో అసలు సినిమా విడుదలయ్యాక బాక్సాఫీసులు బద్ధలైపోవడం ఖామమంటున్నారు.

కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే కోటి మంది దాన్ని చూశారు. దీంతో ఈ ఫిల్మ్‌ పై అందరిలోనూ అంచనాలు భారీగా పెరిగిపోయి. ఇందులో కథేమిటి.. కొత్త టెక్నాలజీ ఏమైనా ఉందా... వంటి అనేకానేక ప్రశ్నలతో చర్చలు జరిగిపోతున్నాయి. సినీ అభిమానులు దీని గురించి తెలుసుకోవడానికి విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రఖ్యాత మార్వెల్ కామిక్స్ లో ఉన్న కెప్టెన్ అమెరికా పాత్ర ఆధారంగానే ఈ సినిమా వస్తోంది. 2011 లో వచ్చిన కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ - 2014లో వచ్చిన కెప్టెన్ అమెరికా.. ది వింటర్ సోల్జర్ సినిమాలకు ఇది సీక్వెల్. ఆంధోనీ, జో రసోల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా వస్తున్న సినిమా 2016 మే 6న విడుదల కాబోతోంది. ఇది త్రీడీ మూవీ కావడం విశేషం.