Begin typing your search above and press return to search.

హీరోయిన్ల ఏజ్ చెప్పారో.. జాగ్రత్త!!

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:37 PM GMT
హీరోయిన్ల ఏజ్ చెప్పారో.. జాగ్రత్త!!
X
అదేంటో తెలియదు కాని.. హాలీవుడ్ లో దాదాపు 40 ఏళ్ళు నిండిన ఇద్దరు పిల్లల తల్లులే హీరోయిన్లుగా కనిపిస్తుంటారు. అక్కడ 30 ఏళ్లు రాగానే పెళ్లయినా కాకపోయినా కూడా పిల్లలను కనేస్తారు. కాని అవన్నీ వారి స్టార్ స్టాటస్ కు అడ్డురావు. వారిని హీరోయిన్లు ప్రజలు కూడా ఆధరిస్తారు. అయితే మన దగ్గర మాత్రం హీరోయిన్ కు 30 దాటినా, పెళ్లయిపోయినా, ఆమె కెరియర్ దాదాపు ఖతమ్ అయిపోయినట్లే.

కాకపోతే అత్యంత హాస్యాస్పదం ఏంటంటే.. ఇప్పుడు హాలీవుడ్ భామలు కూడా తమ వయస్సును జనాలకు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ముఖ్యంగా ఎంటర్టయిన్మెంట్ వెబ్ సైట్లలో అసలు హీరోయిన్ల ఏజ్ గురించి చెబుతుంటే.. తమను శృంగారదేవతలలా ఆరాధించే ఫ్యాన్స్ ఫీలవుతున్నారని వీరు ఆందోళన చెందుతున్నారు. అందుకే వీరికోసం ఇప్పుడు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో’ అడిగినట్లుగా.. కేలిఫోర్నియా గవర్నర్ ఓ బిల్లుపై సంతకం చేసేశారు. దీని ప్రకారం ఎంటర్టయిన్మెంట్ ఇండస్ర్టీలో ఉన్నవారి వయసును కమర్షియల్ ఎంటర్టెయిన్మెంట్ వెబ్ సైట్లు డిస్ ప్లే చేయడంపై నిషేధం విధించినట్లే. ఇప్పటికే వయసును డిస్ ప్లే చేస్తున్న సైట్లు కూాడా వాటిని తొలగించాల్సి ఉంటుంది.

ఇది మరీ టూ మచ్ కదూ.. ఈ విధంగా వెబ్ సైట్లను నిషేదించడం అంటే అది మీడియా స్వేఛ్చను హరించినట్లు కాదా? పైగా స్వయంగా అమెరికాలోనే ఇలా జరుగుతుంటే.. వీరు మాత్రం పక్కదేశాలకు మీడియా స్వేచ్ఛ గురించి క్లాసులు పీకుతారు ఎందుకో!!