Begin typing your search above and press return to search.

చిరు152: అరవింద్ గారికి ఇచ్చిన మాట తప్పినట్టేనా?

By:  Tupaki Desk   |   15 Oct 2019 9:26 AM GMT
చిరు152: అరవింద్ గారికి ఇచ్చిన మాట తప్పినట్టేనా?
X
గీతా ఆర్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తే అది సూపర్ హిట్ అని ముందే డిసైడ్ అయిపోవాలి. ఎందుకంటే ఆ కాంబినేషన్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. చిరంజీవి- అరవింద్ బంధం కూడా అలాంటిదే. అరవింద్ గారు ఏ సినిమా చేసినా దాదాపుగా సక్సెస్ గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది.. మెగాస్టార్ తో సినిమా అంటే ఆయన దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకుంటారు. అయితే ఎందుకో మెగాస్టార్ మాత్రం తన రీఎంట్రీ తర్వాత అల్లు అరవింద్ గారికి సినిమాను నిర్మించే అవకాశం ఇవ్వడం లేదు. ఇదో హాట్ టాపిక్ గా మారింది.

చిరు రీ-ఎంట్రీ సినిమా 'ఖైది నెం.150' ను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు. అప్పట్లోనే నెక్స్ట్ సినిమాను కూడా తనే నిర్మిస్తానని చరణ్ చెప్పారు. అయితే తర్వాత చేయబోయే సినిమా #చిరు152 గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఉంటుందని అన్నారు. జస్ట్ గాసిప్ లాగా కాకుండా అ సినిమా గురించి వేదికపైనే ప్రకటించారు. ఇక ఆ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని కూడా స్పెక్యులేషన్స్ ప్రచారంలోకి వచ్చాయి. రీసెంట్ గా #చిరు152 లాంచ్ అయింది. ఈ సినిమాకు దిల్ రాజు కాంపౌండ్ సంబంధీకులు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాతలు. చరణ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో భాగస్వాములు. ఎక్కడా గీతా ఆర్ట్స్ పేరు వినిపించడం లేదు.

చరణ్ వరసగా మెగాస్టార్ తో రెండు సినిమాలు నిర్మించారు కాబట్టి ఈ సినిమా ప్రొడక్షన్ లో గీతా ఆర్ట్స్ వారిని ఇన్వాల్వ్ చేయవచ్చని.. కాకపోతే చరణ్ మాత్రం తనే స్వయంగా పార్టనర్ గా మారడంతో అల్లు అరవింద్ గారు దూరంగా ఉండిపోయారని అంటున్నారు. ఇక్కడే ఏదో తేడా కొట్టిందని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. చరణ్ ఆలోచనలలో మార్పుల కారణంగానే గీతావారు దూరంగా ఉండాల్సి వస్తోందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ లో 152వ చేస్తానని చెప్పిన మాటను మెగాస్టార్ తప్పారనే మాట కూడా వినిపిస్తోంది.