పెదవి ముద్దులు కట్ చేస్తే ఎలా?

Tue Feb 12 2019 19:53:05 GMT+0530 (IST)

పెదవి ముద్దులు.. బెడ్ రూమ్ సన్నివేశాలు.. చెలరేగిపోయే పంచ్ డైలాగులు.. బూతులు .. ఇదీ నేటి సినిమాల సన్నివేవం. ఆ మాత్రం ఘాటు లేకపోతే కష్టం అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సన్నివేశం నుంచి బయటపడేందుకు సెన్సార్ బోర్డ్ చాలానే చర్యలు తీసుకుంటోంది. అయినా కొన్నిటి విషయంలో చూసీ చూడనట్టు వదిలేయడంపై చాలా సార్లు ఆసక్తికర చర్చ సాగింది. బాలీవుడ్ లో శృతి మించిన శృంగార సన్నివేశాల్ని చూపించే అలవాటు అనాదిగా ఉంది. అది ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంటోంది. హాలీవుడ్ తర్వాత అంతటి స్థాయి బాలీవుడ్ లో ఇప్పటికే ఉంది. చాలా కొద్ది సినిమాలకు మాత్రం కొన్ని విషయాల్లో నిబంధనల్ని అమలు చేసినా మెజారిటీ పార్ట్ శృంగారం విషయంలో చూసీ చూడనట్టే సెన్సార్ బోర్డ్స్ వ్యవహరించడంపైనా ఆసక్తికర చర్చ సాగింది.ఇటీవలే రణవీర్ సింగ్ - ఆలియా భట్ జంటగా జోయా అక్తర్ నిర్మించిన గల్లీ బోయ్స్ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. అయితే ఈ సినిమాలో హద్దు మీరిన శృంగార సన్నివేశాలు పెదవి ముద్దు సన్నివేశాలకు సెన్సార్ బృందం చెక్ పెట్టేసిందిట. పైగా ఇందులో బూతు డైలాగులకు కొదవేం లేకపోవడంతో చాలా వాటికి కట్స్ చెప్పిందని తెలుస్తోంది. డైలాగులతో పాటు పెదవి ముద్దులపై బిగ్ పంచ్ పడిందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒకవేళ ఆ సన్నివేశాల్ని కోసేయకపోతే `ఎ` సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేదని చెబుతున్నారు.

ఆసక్తికరంగా రణవీర్-అలియా మధ్య ఉండే 13 సెకన్ల వేడెక్కించే ముద్దు సన్నివేశం తొలగించడంపైనా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. యూత్ కి కిక్కిచ్చే కంటెంట్ తొలగిస్తే ఆ మేరకు పంచ్ పడుతుందన్న ఆందోళన గల్లీ బోయ్స్ మేకర్స్ లో నెలకొందిట. కాస్త ఆలస్యంగా అయినా కట్స్ విషయం లీకైంది. కేవలం ఆ ముద్దు సన్నివేశాల వల్లనే `గల్లీ బోయ్స్` ట్రైలర్ సోషల్ మీడియాల్లో దూసుకెళ్లింది.  సినిమాపైనా క్రేజు పెరిగింది. ఇప్పుడిలా ఉన్నట్టుండి అదరతాంబూలం లేకపోతే ఎలా? అంటూ నసిగేస్తున్నారు యంగ్ బోయ్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.