టైటిల్ రిజిస్ర్టేషన్ విషయంలో జాగ్రత్త

Tue Mar 21 2017 10:14:59 GMT+0530 (IST)

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. రామ్ మోహన్ రావులు.. ఫిలిం ఛాంబర్స్ పై ప్రజలను హెచ్చరిస్తూ ఒక జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశారు.

'ఫిలిం ఛాంబర్స్ కు దగ్గరగా ఉండే పేర్లతో కొందరు సంస్థలను నడుపుతూ ఫిలిం మేకర్స్ ను మోసం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు.. క్లియరెన్స్ విషయంలో చాలామంది మోసపోతున్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లు మాత్రమే..  ప్రభుత్వంతో.. పరిశ్రమతో గుర్తించబడ్డాయి. ఇప్పటికే చాలామంది మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకే టైటిల్ రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర కార్యకలాపాలకు సరైన ఆర్గనైజేషన్ ను ఎంచుకోవాలని చెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం' అని ఉమ్మడి స్టేట్మెంట్ చెబుతోంది.

ది హైద్రాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1941లో  ప్రారంభం కాగా.. దీన్ని 2009లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గాను.. 2014లో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గాను పేరు మార్చారు. అలాగే 1951లో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం కాగా.. ఆ తర్వాత దీన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ గా పేరు మార్చారు. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. తగిన ఆర్గనైజేషన్ ను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/