Begin typing your search above and press return to search.

కళ్యాణ్ చేతికి ప్రభుదేవా లక్ష్మి

By:  Tupaki Desk   |   19 July 2018 7:17 AM GMT
కళ్యాణ్ చేతికి ప్రభుదేవా లక్ష్మి
X
డాన్స్ మాస్టర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి ప్రేమికుడితో హీరోగా మారి రెండు రకాలుగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ప్రభుదేవా కొత్త సినిమా లక్ష్మి విడుదలకు సిద్ధమవుతోంది. చిన్న పాపను లీడ్ రోల్ గా తీసుకుని డాన్స్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు ఎఎల్ విజయ్ రూపొందించిన ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. దీని తాలూకు తెలుగు హక్కులను సికె బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కళ్యాణ్ దక్కించుకున్నారు. ఈ ఏడాది జైసింహ-ఇంటెలిజెంట్ నిర్మించిన ఈయనకు 2018లో ఇదే తొలి డబ్బింగ్ సినిమా. సూపర్ డాన్సర్ అనే హిందీ రియాలిటీ డాన్స్ షోలో విన్నర్ గా నిలిచిన దిత్యా బండేను లక్ష్మి కోసం ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ఇప్పటికే ప్రోమోల రూపంలో ఈ పాప ప్రభుదేవాతో పోటీ పడుతూ డాన్స్ చేయడాన్ని చూసి నెటిజెన్లు ఔరా అనుకున్నారు. వాటి వల్లే దీనికి మంచి బజ్ కూడా వచ్చింది. అదే షోలో పాల్గొన్న అక్షత్ సింగ్-జిత్ దాస్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ప్రభుదేవా సినిమా వచ్చి చాలా రోజులయ్యింది. ఆ మధ్య తమన్నా కీలక పాత్రలో హారర్ ఫిలిం అభినేత్రి చేసాక మళ్ళి కనిపించలేదు. రెండు నెలల క్రితం గులేబకావళి అనే డబ్బింగ్ సినిమా ఒకటి వచ్చింది కానీ వర్క్ అవుట్ కాలేదు. లక్ష్మితో మళ్ళి కం బ్యాక్ అవుతుందని ప్రభుదేవా కూడా ధీమాగా ఉన్నాడు. విడుదల తేదీ ఇంకా ఖారారు చేయాల్సిన లక్ష్మి నగేష్ కుకునూర్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందింది. సిఎస్ శ్యామ్ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ గా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని ఇప్పటికే టాక్ ఉంది. ఐశ్వర్య రాజేష్-కోవై సరళ- కరుణాకరన్-సల్మాన్ యూసఫ్ ఖాన్-చామ్స్-సామ్ పాల్ ఇతర పాత్రల్లో నటించిన లక్ష్మి విడుదలను త్వరలో ఖరారు చేయనున్నారు. తమిళ్ లో పాటు తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా విడుదల అవుతుంది.