Begin typing your search above and press return to search.

డేంజర్ జోన్ లో మెగా హీరో

By:  Tupaki Desk   |   13 Jun 2018 8:45 AM GMT
డేంజర్ జోన్ లో మెగా హీరో
X
మావయ్య చిరంజీవిలాగా మొదలుపెట్టింది ఒక సినిమా విడుదలైంది మరో సినిమా అనే సెంటిమెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అడుగులు మాత్రం ఆయనలా లేకపోవడం క్రమక్రమంగా పరిశ్రమకు దూరమయ్యే ప్రమాదాన్ని తెచ్చి పెడుతోంది. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్లకు తోడు పాత పాటలను రోత పుట్టేలా రీమిక్స్ చేసే ప్రయత్నాలు అన్ని బెడిసి కొట్టేశాయి. ఈ మెగా హీరో కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు బిజినెస్ అనుకున్న రీతిలో సాగకపోవడం మెగా బ్రాండ్ ని నమ్ముకుని ఈ సినిమా తీసిన నిర్మాత కెఎస్ రామారావుని ఇప్పటికే బాగా కలవరపెడుతుననట్టు సమాచారం.

తేజు మార్కెట్ రెండేళ్ల క్రితం చాలా మెరుగ్గా ఉండేది. వరసగా ఐదు పరాజయాలు పలకరించడంతో ఇప్పుడు బాగా వెనుకబడి పోయాడు.సరిగ్గా ఈ టైంలో మాస్ ని టార్గెట్ చేయని తేజ్ ఐ లవ్ యుతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో బయ్యర్ల వైపు నుంచి తగినంత ప్రోత్సాహం లేకపోవడం ఇతన్ని వ్యక్తిగతంగా ఇష్టపడే అభిమానులకు నిరాశ కలిగించేదే. చేదుగా ఉన్నా నిజం ఒప్పుకోక తప్పదు.

వాస్తవంగా ఫిదా విడుదల ముందు వరకు వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజ్ మార్కెట్ చెప్పుకోదగ్గ రీతిలో ఉండేది . కానీ ఫిదా బ్లాక్ బస్టర్ తో పాటు తొలిప్రేమ సూపర్ సక్సెస్ వరుణ్ తేజ్ కి ఒకేసారి డబుల్ ప్రమోషన్ ఇప్పిస్తే జవాన్-ఇంటెలిజెంట్ ఫలితాలు సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ని ఇంకా కిందకు తీసుకొచ్చాయి. తనకున్న సీనియారిటీని ఉపయోగించి కోరుకున్న రేట్లకో లేక అంత కన్నా తక్కువకో తేజ్ ఐ లవ్ యుని కెఎస్ రామారావు అమ్ముకున్నా ఇది సూపర్ హిట్ అయితేనే తేజుతో సినిమాలకు నిర్మాతలు ముందుకు వస్తారు. యావరేజ్ అనిపించుకున్నా లాభం లేదు. అది డివైడ్ టాక్ గా మారి చివరికి తేడా కొట్టిస్తుంది. బాగుంది అని మౌత్ పబ్లిసిటీ వస్తే తప్ప జనం థియేటర్ దాకా రారు.

మరి ఇంత పెద్ద ఛాలెంజ్ ని సాయి ధరమ్ తేజ్ మోయడం అంత ఈజీ కాదు. అసలే జూన్ 29 విడుదల చేస్తారా అనే అనుమానాన్ని ఇప్పటికీ పూర్తి కానీ బిజినెస్ బలపరుస్తూనే ఉంది. పాపులారిటీలో ఈ మెగా హీరోనే ఇప్పుడు వెనుకబడి ఉన్నాడు. మరి రేస్ లో నుంచి ముందుకు వస్తాడా లేక పూర్తిగా తప్పుకునే ప్రమాదంలో పడతాడా తేజ్ ఐ లవ్ ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క సినిమా వల్ల జాతకం డిసైడ్ కాకపోయినా ముందు వచ్చే వాటిపై మాత్రం తీవ్ర ప్రభావం ఉంటుంది. అందులో సందేహం లేదు.