Begin typing your search above and press return to search.

బుర్రా సాయిమాధవ్ ఆ బ్యాచ్ లోకి..

By:  Tupaki Desk   |   27 April 2018 5:21 AM GMT
బుర్రా సాయిమాధవ్ ఆ బ్యాచ్ లోకి..
X
డైరెక్టర్లు అందరూ మంచి రైటర్లు కాలేకపోవచ్చు. కానీ గట్టిగా ట్రయ్ చేస్తే మంచి రైటర్లంతా డైరెక్టర్లు కాగలరు. ఇండస్ట్రీలో రైటర్ కన్నా దర్శకుడికి మాటకే విలువ ఎక్కువ. అందుకే రైటర్లుగా పేరు తెచ్చుకున్న వారంతా మెగా ఫోన్ పట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

స్టోరీ రైటర్ల నుంచి డైరెక్టర్లుగా మారిన వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శివ నేడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్లను స్ఫూర్తిగా తీసుకుని అద్భుతమైన సంభాషణలు రాస్తాడని పేరు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ కూడా డైరెక్టర్ కావాలని అనుకుంటున్నాడు. రైటర్ గా సాయిమాధవ్ ఖాతాలో కంచె.. గోపాల గోపాల.. ఖైదీ నంబర్ 150 వంటి భారీ సినిమాలే ఉన్నాయి. ఈ ఇమేజ్ తో ఓ మూవీ డైరెక్షన్ చేసి తన సత్తా చాటుకోవాలని అతడు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

ఓ స్టార్ హీరోతో సాయి మాధవ్ డైరెక్షన్ లో సినిమా తీసేందుకు పెద్ద ప్రొడ్యూసర్ ఒకరు రెడీగా ఉన్నాడుట. రైటర్ గా ఉన్న కమిట్ మెంట్లు అన్నీ త్వరగా పూర్తిచేసి త్వరలోనే తన డైరెక్షన్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాలన్నది సాయిమాధవ్ ఆలోచనగా తెలుస్తోంది. త్వరలోనే త్రివిక్రమ్.. కొరటాల శివ.. వక్కంతం వంశీ బ్యాచ్ లోకి వచ్చేస్తాడన్న మాట. ఆల్ దిబెస్ట్ సాయిమాధవ్.