వర్మను తిట్టిపోసిన రైటర్ తమ్ముడు

Mon Feb 18 2019 12:29:50 GMT+0530 (IST)

ఒకపక్క ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు ఏర్పాట్లు జరుగుతుండగానే మరోపక్క రామ్ గోపాల్ వర్మ తన లక్మిస్ ఎన్టీఆర్ పబ్లిసిటీని వేగవంతం చేసాడు. ఎప్పుడు రిలీజ్ అనే మాట చెప్పకపోయినా పదే పదే బాలయ్యతో సినిమాతో పోల్చుకుంటూ తనది హై లైట్ చేసుకునే ప్రయత్నాలు ఉదృతంగా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వర్మ చేసుకుంటున్న ఫ్రీ పబ్లిసిటీ ఒకరకంగా తనకు ప్లస్ కాగా ఇంకో మార్గంలో మహానాయకుడుని డ్యామేజ్ చేస్తోంది. ఇది ఓ నెటిజెన్ కు ఆగ్రహం కలిగించింది.ఎవరో అయితే లైట్ అనుకోవచ్చు  కానీ అతను స్వయానా ఎన్టీఆర్ రచయిత సాయి మాధవ్ బుర్ర సోదరుడు. పేరు నరసింహ. సినిమా జర్నలిస్ట్ గా పేరున్న ఇతను ఎన్టీఆర్ కథానాయకుడులో ఎన్టీఆర్ బాలకృష్ణకు నామకరణం చేసే సీన్ లో పూజారిగా కనిపిస్తాడు. ఇతనే వర్మను తన సోషల్ మీడియా అకౌంట్ లో దుమ్మెత్తిపోసాడు.

వర్మ పరిశ్రమకు పట్టిన ఓ పురుగుని వివాదాలతో బ్రతికే కుక్క అంటూ కాస్త తీవ్రమైన పదజాలంనే వాడాడు. పక్క సినిమా నాశనమైపోయి మాది మాత్రమే ఆడాలనే ఇలాంటి దుర్మార్గమైన మనస్తత్వం ఎక్కడా చూడలేదని ఇలాంటివాళ్లను ప్రోత్సహిస్తే అది పరిశ్రమ మనుగడకే ప్రమాదమని హెచ్చరించాడు. అన్నయ్య రాసిన సినిమా అందులో తాను నటించాడు మహానాయకుడులో వీరి తల్లి కూడా చిన్న పాత్ర చేసారు. అలాంటప్పుడు ఈ వేదన ఇలా వ్యక్తపరచడంలో అర్థముంది కానీ మరీ కుక్క లాంటి పదాలు వాడితేనే లేనిపోని ఇబ్బంది. దీని వల్ల నష్టమేమి లేదు కాని వర్మ దీన్ని కూడా ఓ పబ్లిసిటీ అస్త్రంగా వాడుకుంటేనే చిక్కు