మహేష్ సినిమాకు బంపర్ డీల్

Tue Apr 23 2019 11:34:40 GMT+0530 (IST)

సూపర్ స్టార్ అనే ట్యాగ్ మహేష్ బాబుకి ఊరికే రాలేదు. బ్లాక్ బస్టర్లు వాణిజ్య లెక్కలకు అందని విజయాలు ఎన్నో సొంతం చేసుకోవడం వల్లే కేవలం ఆ పేరు మీద బ్రాండింగ్ ఇప్పుడు వందల కోట్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం మహర్షి విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసిన ప్రిన్స్ ఇకపై దూకుడు పెంచేలా కనపడుతున్నాడు.తన సినిమాల బిజినెస్ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగులు వేసే మహేష్ నమ్రతలు ఇప్పుడీ 26వ సినిమాకు సైతం అలాంటి ప్లానింగ్ తోనే ఉన్నట్టు టాక్. ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం దిల్ రాజు-అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోయే ఈ సినిమాకు బడ్జెట్ ని రెమ్యునరేషన్లు కాకుండా 50 కోట్లకు లాక్ చేశారట. అనిల్ రావిపూడికి పారితోషికం రూపంలో 10 కోట్ల దాకా ముడుతుంది.

మరి మహేష్ డీల్ సంగతి ఏంటి అనే డౌట్ రావొచ్చుగా. శాటిలైట్ డిజిటల్ వివిధ బాషలకు డబ్బింగ్ ఇలా అన్ని హక్కులను కలిపి విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని 40 కోట్ల దాకా ఆశిస్తున్నారట. ఇది నేరుగా మహేష్ కు జమైపోతుంది. ఈ బాద్యతలను నమ్రత చూసుకుంటుంది. ఇక అనిల్ సుంకర దిల్ రాజుల మధ్య భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

ఈ ఇద్దరు పెట్టె పెట్టుబడి వచ్చే లాభాలు అన్ని ధియేట్రికల్ బిజినెస్ నుంచే తీసుకోబోతున్నారు. అది ఎలాగూ ఎంత లేదన్నా 80 నుంచి 90 కోట్ల మధ్య జరుగుతుంది కాబట్టి సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే మహేష్ ఫుల్ స్క్రిప్ట్  నెరేషన్ వినకుండానే ఈ రేంజ్ లో చర్చ నడుస్తోంది అంటే మహేశా మజాకా అనిపిస్తోంది కదూ