Begin typing your search above and press return to search.

డేట్ ఫిక్స్ చేసుకున్న బ్రోచేవారెవరురా

By:  Tupaki Desk   |   11 Jun 2019 6:39 AM GMT
డేట్ ఫిక్స్ చేసుకున్న బ్రోచేవారెవరురా
X
రొటీన్ కి భిన్నంగా కాస్త విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సాగుతున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న బ్రోచేవారెవరురా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శ్రీవిష్ణుతోనే తన మొదటి సినిమా మెంటల్ మదితో పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ దీనికి దర్శకుడు. ఇప్పటికే టీజర్ వెరైటీ కాన్సెప్ట్ తో ఆసక్తి రేపగా త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఓ ఫిలిం మేకర్ గా సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నివేత పేతురాజ్ నిర్మాతగా ఓ పాత్ర చేస్తుండగా ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ హీరో ఫ్రెండ్స్ గా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మెయిన్ హీరోయిన్ గా నివేదా థామస్ కు ప్రాధాన్యత కలిగిన రోల్ ఇచ్చారు. మంచి పాజిటివ్ బజ్ తో విడుదలవుతున్న బ్రోచేవారెవరురాకు అదే రోజు ఏమంత పోటీ లేదు. మౌత్ టాక్ మీద ఆధారపడే ఇలాంటి సినిమాలకు కంటెంట్ ముఖ్యం కాబట్టి దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

సినిమా ప్రపంచంలో జరిగే కొన్ని సరదా సంఘటనలను కూర్చి అల్లుకున్న కథలో బ్రోచేవారెవరురా ఖచ్చితంగా అలరిస్తుందని వివేక్ ఆత్రేయ నమ్మకంగా ఉన్నాడు. ఇతని మొదటి సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన వివేక్ సాగర్ దీనికీ ట్యూన్స్ ఇవ్వడం విశేషం. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన బ్రోచేవారెవరురా మీద శ్రీవిష్ణు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇవి ఎంతవరకు నెరవేరుతాయో తెలియాలంటే 28 దాకా ఆగాల్సిందే