Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం గురించి టెన్షన్‌ పడొద్దు

By:  Tupaki Desk   |   4 May 2016 10:50 AM GMT
బ్రహ్మోత్సవం గురించి టెన్షన్‌ పడొద్దు
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అండ్‌ శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ''బ్రహ్మోత్సవం''. గతంలో వీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ సందడి చేశారు కాబట్టి.. ఈసారి వీరిపై మాంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు రిలీజ్‌ డేటు గురించి.. ఇంకా పెండింగ్‌ లో ఉన్న షూటింగ్‌ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది.

నిజానికి ఓ రెండు మూడు రోజుల క్రితం విన్న న్యూస్‌ ప్రకారం అయితే.. మరో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవం షూటింగ్‌ చేయాల్సి ఉంది. అందులో ముఖ్యంగా సమంతతో తీయాల్సిన రెండు పాటలు కూడా ఉన్నాయి. మరి వీటిని ఆల్రెడీ తీసేశారా.. లేకపోతే సినిమాలో నుండి తీసేశారో తెలియదు కాని.. బ్రహ్మోత్సవం షూటింగ్‌ మొత్తం పూర్తయిపోయిందని చెబుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం మహేష్‌ బాబు రెస్ట్‌ తీసుకుంటుండగా.. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నాడు. రేపో మాపో మహేష్‌ తన డబ్బింగ్‌ వర్క్‌ మొదలుపెడతాడట. ఎట్టి పరిస్థితుల్లో మే 10 నాటికి తొలికాపీని సిద్దం చేసి.. వెంటనే సెన్సార్‌ చేయించి.. 18వ తారీఖు నాటికి సినిమాను అన్ని ఏరియాలకూ పంపించేసి.. మే 20న సినిమాను రిలీజ్‌ చేయాలనేది ప్లాన్‌ అని తెలుస్తోంది.

ప్రస్తుతానికి.. వీరు అనుకున్న తేదీల నాటికి అనుకున్నట్లే పనులన్నీపూర్తి చేసుకుని.. సినిమాను ధియేటర్లో దించుతారని ఆశిద్దాం. టెన్షన్ పడకండి ఫ్యాన్స్.