Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం.. ఏంటండీ పబ్లిసిటీ?

By:  Tupaki Desk   |   29 May 2016 3:30 PM GMT
బ్రహ్మోత్సవం.. ఏంటండీ పబ్లిసిటీ?
X
బ్రహ్మోత్సవం.. రీసెంట్ టైంలోనే కాదు.. టాలీవుడ్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ లాస్ వెంచర్ గా నిలవబోతోందనే విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. ఇప్పటికే నిర్మాత పీవీపీ నుంచి లోకల్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారంపై హామీలు రాగా... ఓవర్సీస్ బయ్యర్ల సంగతి మహేషఅ చూసుకుంటున్నాడని అంటున్నారు. అంతే కాదు.. ఈ మూవీ ఫెయిల్యూర్, డైరెక్టర్ సెలక్షన్ విషయంలో బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు మహేష్ చెప్పేశాడు కూడా.

ఇదంతా హీరో, ప్రొడ్యూసర్ల వెర్షన్. మరి సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చివరి ఆట పడే వరకూ పోరాటం కంటిన్యూ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా బ్రహ్మోత్సవం రెండో వారం అంటూ కడప జిల్లా పేపర్లలో ఓ యాడ్ ఇచ్చారు. అందులో 'బోర్ సీన్స్ తీసేయడం వల్ల చూడదగ్గ కుటుంబ కథా చిత్రం' అంటూ యాడ్ లో మెన్షన్ చేయడం విశేషం.

రిలీజ్ కి ముందు ఓ 12, తర్వాత ఓ 18 నిమిషాల మేర కట్ చేసి బ్రహ్మోత్సవంను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అయినంత మాత్రాన.. ఇప్పటివరకూ బోర్ కొట్టే సీన్లున్న సినిమా అనే టైపులో ప్రచారం చేయడం చేయడం ఆశ్చర్యకరం. స్టేట్ వైడ్ గా ఇలాంటి ప్రచారం చేయకపోయినా.. ఒక చోట చేసే పబ్లిసిటీ.. టోటల్ గా ఎఫెక్ట్ చూపించే ప్రభావం కూడా ఉంటుంది. మరి ఈ టైపు ప్రచారాన్ని మహేష్, పీవీపీలు సపోర్ట్ చేయరు గానీ.. ఓ కన్నేసి ఉంచడం బెటర్ కదా.