Begin typing your search above and press return to search.

భరణి, రేవతి.. మధ్యలో మహేష్..

By:  Tupaki Desk   |   9 Oct 2015 5:30 PM GMT
భరణి, రేవతి.. మధ్యలో మహేష్..
X
రామోజీ ఫిలిం సిటీలో మహేష్ సందడి హై ఓల్టేజ్ కి చేరిపోయింది. ఇప్పటికే భారీ సెట్టింగ్స్ - డెకరేషన్స్ తో బ్రహ్మోత్సవం కోసం ఓ పాటను షూట్ చేశారు. ఈ ఒక్కసాంగ్ కోసమే మూడున్నర కోట్లు ఖర్చుపెట్టించి, అత్యంత రిచ్ గా చిత్రీకరించాడు శ్రీకాంత్ అడ్డాల. సాంగ్ పిక్చరైజేషన్ కంప్లీట్ కాగానే.. సీన్స్ షూటింగ్ మొదలుపెట్టేశారు. అదో అందమైన ఫ్యామిలీ. ఆ కుటుంబ వాతావారణాన్ని చూస్తే.. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు గుర్తొస్తాయంటారు ఆ ఊరోళ్లు. అంతగా సందడి ఉంటుంది మహేష్ ఉన్న ఇంట్లో.

ఇది సినిమాలో సీన్ అయినా.. ఈ మూవీలో భారీ తారాగణం ఉండడంతో బ్రహ్మోత్సవం షూటింగ్ లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇంతకీ ప్రస్తుతం తీస్తున్న సన్నివేశం ఏంటంటే.. మహేష్ బాబు - తనికెళ్ల భరణి - రేవతి కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ల మాటలు అయిపోగానే కట్ చెప్పేసి సూపర్బ్ అంటూ అరిచాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. దాదాపు టాకీ పార్ట్ పూర్తయ్యే వరకూ కంటిన్యూగా షూట్ చేయబోతున్నారు.

సమంత కాజల్ - ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి.. పొట్లూరి ప్రసాద్ నిర్మాత. శ్రీమంతుడు సక్సెస్ లో ఉన్న మహేష్.. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేసి, ఫ్యామిలీ కంటెంట్ తో చేస్తున్న మూవీ ఇది. అడ్డాల - సూపర్ స్టార్ మంచి కాంబినేషన్ అని ఇప్పటికే సీతమ్మ వాకిట్లో చిత్రంతో ప్రూవైంది. ఈసారి అంతకుమించిన బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా చెబ్తున్నాడు డైరెక్టర్. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ మూవీ షెడ్యూల్ చేయబోతున్నారు