Begin typing your search above and press return to search.

బ్రహ్మానందం ఫ్రీగా చేస్తానని అన్నాడట

By:  Tupaki Desk   |   2 Dec 2016 7:30 PM GMT
బ్రహ్మానందం ఫ్రీగా చేస్తానని అన్నాడట
X
ఈ మధ్య తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం హవా బాగా తగ్గిపోయింది. ఇంతకుముందు ఆయన లేని పెద్ద సినిమా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆయన ఏదైనా సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇలాంటి టైంలో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ దర్శకుడు శివరాజ్ కనుమూరి బ్రహ్మానందను తన సినిమాలో భలేగా వాడుకున్నాడు. ఇందులో ఒక పాత్ర సందర్భానుసారంగా తన ఫీలింగ్స్ ఏంటో చెప్పడానికి బ్రహ్మానందం హవభావాల్ని వాడుకుంటుంది. బ్రహ్మి ఎక్స్ ప్రెషన్లకు ఇమోజీలు యాడ్ చేసి తన మొబైల్ ద్వారా వేరే వాళ్లకు మెసేజ్ లు పంపుతుంది. బ్రహ్మి తాను కనిపించకుండానే ఇలా వెరైటీగా వినోదం పంచాడు. ఆ పాత్రను చేసింది ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కావడం విశేషం.

ఐతే తన బొమ్మను పాత్రను ఇలా వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. కనీసం తనకు థ్యాంక్స్ కార్డు కూడా వేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడట. ఈ సంగతి హీరో శ్రీనివాసరెడ్డి వెల్లడించాడు. ‘‘బ్రహ్మానందం గారిని మా సినిమా కోసం ఇలా వాడుకుందామని దర్శకుడు నాతో అంటే.. నేను ఆయనతో మాట్లాడతానని చెప్పాను. ఆయనకు ఫోన్ చేసి విషయం చెబితే.. నా బొమ్మ వాడుకోవడం ఎందుకురా నేనే చేస్తాను ఫ్రీగా నీకోసం అన్నారు.
వద్దులెండి గురువుగారు.. మిమ్మల్ని పెట్టుకునే స్థాయి మాకు లేదు అన్నాను. మేమప్పుడు భీమిలిలో షూటింగ్ చేస్తున్నాం. ఆయన్ని అక్కడికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం ఎందుకనిపించింది. సినిమా పూర్తయ్యాక ఆయనకు థ్యాంక్స్ కార్డు వేస్తామని ఫోన్ చేసి చెబితే.. ఇది నా సినిమా.. అలాంటిదేమీ అక్కర్లేదని చెప్పారు. అదీ ఆయన గొప్ప మనసు’’ అని శ్రీనివాసరెడ్డి తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/