Begin typing your search above and press return to search.

సౌఖ్యం కోసం బ్రహ్మీ తప్పలేదు...

By:  Tupaki Desk   |   10 Oct 2015 1:30 AM GMT
సౌఖ్యం కోసం బ్రహ్మీ తప్పలేదు...
X
గోపీచంద్ ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు. మొగుడు కొట్టిన దెబ్బ తర్వాత వెయిట్ చేసి సాహసం చేసినా.. ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో మరోసారి గ్యాప్ తీసుకుని ఓపిగ్గా లౌక్యం చేశాడు. బ్రహ్మీతో కలిసి చేసిన సీన్స్ లో కామెడీ అదిరిపోవడంతో.. ఏళ్ల తర్వాత విజయం దక్కించుకున్నాడు. తర్వాత జిల్ మనిపిద్దామని ట్రై చేసినా.. గోపీచంద్ కే గుండె ఝల్లుమనే షాక్ ఇచ్చింది ఆ మూవీ. దీంతో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సౌఖ్యం అంటున్నాడు.

ఏఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు పెరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే మళ్లీ బ్రహ్మీని తోడు తెచ్చుకుని. వీళ్లిద్దరి కాంబినేషన్ సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు ప్రస్తుతం. హైవేపై కారులో వెళ్తున్నపుడు జరిగే సన్నివేశాన్ని పంచ్ డైలాగ్స్ ముంచెత్తుతూ కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడున్నది బ్రహ్మీ కదా.. అందుకే నవ్వుల పువ్వులు పండుతున్నాయి.

అన్నట్లు ఈ మూవీలో కథానాయిక రెజీనా. సుబ్రమణ్యం సక్సెస్ తర్వాత.. గ్లామర్ హీరోయిన్ గా మారిపోయింది రెజీనా. ఇందులోనూ గోపీచంద్ తో చేసే రొమాంటిక్ సన్నివేశాలు.. ప్రేక్షకులకు సౌఖ్యాన్ని పంచుతాయట. అంతగా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ పండేలా చూసుకుంటున్నాడు డైరెక్టర్. ఓ హిట్, ఓ ఫట్ అంటూ మూవీస్ ఇచ్చే గోపీచంద్ కి.. జిల్ ఫ్లాప్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో.. సౌఖ్యంపై అంచనాలు బాగానే ఉన్నాయి.