Begin typing your search above and press return to search.

ఎవరు ఎవరికి లైఫ్ ఇస్తారో?

By:  Tupaki Desk   |   5 Oct 2015 10:30 PM GMT
ఎవరు ఎవరికి లైఫ్ ఇస్తారో?
X
శ్రీను వైట్ల - బ్రహ్మానందం.. ఈ కాంబినేషన్ కి హిలేరియస్ కామెడీ పండించడం లో స్పెషల్ క్రేజ్ ఉంది. ఢీ నుంచి రెడీ, దూకుడు నుంచి వీళ్లిద్దరూ థియేటర్ల ను నవ్వుల తో నింపేశారు. కానీ బాద్ షా, ఆగడు లో మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు వీళ్ల కాంబినేషన్. మళ్లీ బ్రూస్ లీ లో మరోసారి కామెడీ పంచ్ ల తో థియేటర్లు దద్దరిల్లే లా నవ్వులు పూయించేందుకు రెడీ అయ్యారు.

సుజుకీ సుబ్రమణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. ఇది బ్రూస్ లీలో బ్రహ్మీ కేరక్టర్. బ్రహ్మానందం కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కేరక్టర్ ఇది. నిజాని కి అసలు వైట్ల మూవీ లో బ్రహ్మీయే లేడని, ఆ కేరక్టర్ ని.. జయప్రకాష్ రెడ్డి తో తీశారనే టాక్స్ వినిపించాయి. బ్రహ్మానందం కి మించి జయప్రకాష్ రెడ్డి సీన్స్ వచ్చాయనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే బ్రూస్ లీ లో బ్రహ్మీ ఉన్నాడని ప్రోమోలోనే చెప్పేశాడు శ్రీను వైట్ల.

ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. బ్రహ్మీ, వైట్ల ఇద్దరూ బ్యాడ్ టైం లోనే ఉన్నారు. ఇద్దరి దగ్గర నుంచి సరైన మూవీ వచ్చి చాలా టైం అయింది. మరిప్పుడు బ్రూస్ లీ మూవీకి సుజుకి సుబ్రమణ్యం కేరక్టర్ అదనపు అసెట్ అయితే.. అప్పుడు వైట్లను బ్రహ్మీ కాపాడినట్లు. అదే.. మూవీ బ్రహ్మాండం గా వచ్చి, అందులో బ్రహ్మానందం కేరక్టర్ కూడా పండితే.. బ్రహ్మీకి వైట్ల లైఫ్ ఇచ్చినట్లవుతుంది. ఎవరికి ఎవరు లైఫ్ ఇస్తారో, బ్రేక్ ఇస్తారో తెలియాలంటే.. అక్టోబర్ 16న బ్రూస్ లీ ది ఫైటర్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.