Begin typing your search above and press return to search.

బ్రహ్మికి ఇచ్చినట్లే ఛాన్సిచ్చి..

By:  Tupaki Desk   |   9 Dec 2017 5:37 PM GMT
బ్రహ్మికి ఇచ్చినట్లే ఛాన్సిచ్చి..
X
ఒకప్పుడు ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మానందం లేకపోతే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మి ఉంటేనే ఆశ్చర్యపోతున్నాం. పెద్ద సినిమాలనే కాదు.. మీడియం రేంజ్.. చిన్న సినిమాల్లో సైతం బ్రహ్మానందం కనిపించడం లేదు ఈ మధ్య. ప్రస్తుతం ఆయన ప్రముఖ పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ మాత్రమే. ఇంకే పెద్ద సినిమాలోనూ నటిస్తున్నట్లుగా సమాచారం బయటికి రాలేదు. ఐతే లేక లేక బ్రహ్మికి నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం వచ్చిందట. కానీ ఆ అవకాశం ఆయనకంత సంతోషమేమీ మిగల్చలేదని సమాచారం.

బాలయ్య కథానాయకుడిగా నటిస్తున్న ‘జై సింహా’ సినిమాలో బాలయ్యకు ఒక కామెడీ పాత్ర దక్కిందట. బ్రహ్మి కోసం రచయిత రత్నం ఒక లెంగ్తీ కామెడీ ట్రాక్ రాశాడట. బాలయ్య కాంబినేషన్లో బ్రహ్మితో ఆ కామెడీ ట్రాక్ ను దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చిత్రీకరించాడట. కామెడీ విషయంలో రవికుమార్ కు మంచి పట్టే ఉన్న విషయంలో ఆయన పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఐతే ఈ కామెడీ ట్రాక్ ఫైనల్ ఎడిటింగ్ లో లేచిపోయినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా నిడివి ఎక్కువైపోవడంతో కత్తి కామెడీ ట్రాక్ మీద పడిందట. దీంతో చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద సినిమాలో నటించిన సంతోషం బ్రహ్మికి లేకపోయింది. ఐతే ఈ చిత్రానికి బ్రహ్మి పేమెంట్ మాత్రం పూర్తిగానే అందుకున్నట్లు తెలిసింది.