Begin typing your search above and press return to search.

సన్నీ కోకోకోలాలో మన కమెడియన్స్

By:  Tupaki Desk   |   26 Jun 2019 4:35 AM GMT
సన్నీ కోకోకోలాలో మన కమెడియన్స్
X
మన నటీనటులు హీరోలు బాలీవుడ్ లో ట్రై చేయడం కొత్తేమి కాదు. చిరంజీవితో మొదలుకుని ప్రభాస్ దాకా అందరూ అక్కడ తమ సత్తా చూపించుకున్న వాళ్ళే. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్స్ మాత్రం అంత సాహసం చేయలేకపోయారు. కొంత లేట్ గా అయినా బ్రహ్మానందం సునీల్ లు మొదటిసారి హింది స్ట్రెయిట్ మూవీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా పార్న్ స్టార్ సన్నీ లియోన్ తో కావడం మరీ విశేషం.

తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీకి కోకోకోలా టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ హవేలీలో ఓ పురాతన బంగాళాలో షూటింగ్ జరుగుతోంది. మరో సెక్సి స్టార్ మందన కరిమి కూడా ఇందులో నటిస్తోండటం ఇంకో విశేషం. ఈ కోకోకోలా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరూ సౌత్ ప్రేక్షకులకూ పరిచయమున్న వారు కాబట్టి డబ్బింగ్ చెప్పే పనులు కూడా జరగబోతున్నాయి.

అయితే హిందిలో డబ్బింగ్ మాత్రం సునీల్ బ్రమ్మీలు చెప్పుకునే అవకాశం తక్కువే. యాస పరంగా హింది మీద పట్టులేని కారణంగా వేరే వాళ్ళ గొంతుల్లో వీళ్ళ కామెడీ చూడాల్సి రావొచ్చు. తెలుగులో మాత్రం స్వంతంగా చెప్పుకుంటారు కాబట్టి సమస్య లేదు. చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. సునీల్ కాంబినేషన్ సీన్లతో పాటు సన్నీ లియోన్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా రూపొందుతున్న కోకోకోలా వర్క్ అవుట్ అయితే మాత్రం ఓ రేంజ్ లో పేలేలా ఉంది