Begin typing your search above and press return to search.

బ్రహ్మాజీ వెరైటీ విషేస్... చూశారా?

By:  Tupaki Desk   |   28 Oct 2016 11:52 AM GMT
బ్రహ్మాజీ వెరైటీ విషేస్... చూశారా?
X
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బ్రహ్మాజీ! ఏమిటి వెటకారం... ఆయన బ్రహ్మాజీ అని మాకు తెలియదా అంటారా? సడన్ గా చూడగానే ఈ ఫోటోలో వ్యక్తి బ్రహ్మాజీ అని చెప్పేవారే ఎక్కువనుకోండి. కాకపోతే ఈ పిక్ చూసినవెంటనే... "బ్రహ్మాజీకి ఏమైంది.. ఒకవైపు ముఖమంతా నలుపు.. మరో వైపు నుదిటిపై రక్తంతో తడిచిన ఎరుపు.. ఎవరూ చెప్పరే" అని అనిపించక మానదు. అలా కంగారు పడాల్సిన పనేమీ లేదని కాసేపు అనుకుందాం!!

తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ. ముందుగా ఈ ఫోటో చూసిన వారు ఏదైనా సినిమా షూటింగ్‌లో దెబ్బలు తగిలాయేమో అనుకుని ఉంటారు.. అదీ కాకపోతే ముందుగానే దీపావళి సెలబ్రేట్‌ చేసుకుని ఈ రేంజ్ లో గాయాలపాలయ్యాడనుకునీ ఉండొచ్చు? అలా అని ఎవరైనా అనుకుంటే వారి అంచనాలన్నీ తప్పే. ఈ ఫోటోను స్వయంగా ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు బ్రహ్మాజీ. ఆ ఫోటో కింద "హ్యాపీ దీపావళి - సేఫ్ దీపావళి" అని కామెంట్‌ కూడా పెట్టాడు. అంటే ఒకవైపు దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే.. మరోవైపు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాగే జరుగుతుంది అంటూ హెచ్చరిస్తున్నాడన్నమాట. సో.. బీ కేర్‌ ఫుల్‌! విష్ యు ది సేం బ్రహ్మాజీ జీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/