విడాకులా.. ఇప్పుడు వద్దులే

Sat Aug 12 2017 10:33:51 GMT+0530 (IST)

సినిమా తారలు అంటే మన ప్రేక్షకులులో ఎంత క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిందే. మనం అభిమానిచే తారలు ప్రేమ కథలు కానీ వారి తదుపరి కార్యక్రమాలు ఏంటో తెలుసుకోవాలి అని ప్రతి అభిమాని అనుకుంటాడు. మనవాళ్ళు ఎక్కువగా తెలుగు సినిమాలే చూసిన హాలీవుడ్ సినిమాలుకు కూడా వీర అభిమానులే. అమెరికా హీరో హీరోయిన్లు అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజే ఉంది. అందులోనూ మన తెలుగులో  యాక్షన్ హీరోలు అంటే మరింత ఎక్కువ పాపులర్. హాలీవుడ్ హాట్ కపుల్  ఏంజిలినా జోలీ - బ్రాడ్ పిట్ చాలకాలంగా కలిసి ఉంది కిందటి ఏడాది విడాకులు కోసం అప్లై చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళ విడాకులు కథ కొత్త మలుపు తిరిగింది.

హాలీవుడ్ సూపర్ స్టార్  బ్రాడ్ పిట్ తాగుడుకు బానిసైయ్యాడు అని  తాగి వచ్చి పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న కారణంగా 2016 సెప్టెంబర్ లో ఏంజిలినా జోలీ  బ్రాడ్ పిట్ నుంచి విడాకులు కోరింది. వీళ్ళు విడిపోయి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో కానీ వాళ్ళను ఆరాదించే అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ చెందారు. ప్రేమ అంటే వీళ్ళ లాగా ఉండాలి అని అప్పటిలో వీళ్ళ పై కథనాలు కూడా వచ్చాయి. ఏంజిలినా జోలీ క్యాన్సర్ బారినపడినప్పుడు బ్రాడ్ పిట్ సేవలను అప్పుడు మీడియా బాగానే ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు భార్య - పిల్లలు దూరమవడంతో బ్రాడ్ పిట్ తీవ్రంగా కుంగిపోయాడట. ఎలాగైనా తన కుటంబంతో కలిసి జీవించాలని భావించి తాగుడు పూర్తిగా మానేశాడట. ఈ విషయం తెలిసి జోలీ తిరిగి భర్త వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు హాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఏంజిలినా ఈ నిర్ణయం భర్త బ్రాడ్ పిట్ పై ప్రేమతో తీసుకోలేదు పిల్లల భవిష్యత్ కోసం తీసుకుంది అని కూడా అనుకుంటున్నారు. ఈ హాలీవుడ్ జంటకు ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు.

మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమాతో స్టార్ కపుల్ గా మారిన వీరు ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రిలోనే అధిక పారితోషకం తీసుకునే నటులు లిస్ట్ లో ఉన్నారు. అయితే ప్రేమ కథలో ఇలాంటివి అన్నీ వస్తూపోతుంటాయని.. ఇలాంటి చిన్న విషయాల కోసం జీవితంలోకి కోరి చిక్కులు తెచ్చుకోవడం మూర్ఖత్వం అని బ్రాడ్ పిట్ అంటున్నాడు. నేను ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలి మాన్ గా మారిపోయాను అని కూడా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. మారి వీళ్ళు ఎప్పుడు అధికారకంగా కలిసి జీవిస్తారో చూడాలి.