Begin typing your search above and press return to search.

బోయపాటికి అగ్ని పరీక్షే

By:  Tupaki Desk   |   22 April 2017 4:21 PM GMT
బోయపాటికి అగ్ని పరీక్షే
X
గతేడాది స్టైలిష్ స్టార్ తో సరైనోడు అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను.. తన తర్వాతి చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంపాటు ప్రీ ప్రొడక్షన్ కే కేటాయించి మరీ.. ప్రెస్టీజియస్ గా ఈ మూవీని రూపొందిస్తున్నాడు బోయపాటి.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోగా.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశారు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు వీలుగా ప్లాన్ చేసుకుంటున్నాడు దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్.. ప్రగ్యా జైస్వాల్ లు హీరోయిన్స్ గా నటించగా.. కేథరిన్ థ్రెసా ఓ ఐటెం సాంగ్ లో మెరవనుంది. జగపతి బాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో వాణీ విశ్వనాథ్.. సితార వంటి సీనియర్ నటీమణులు కూడా ఉన్నారు. ఈ మూవీతో సక్సెస్ సాధించాలనే ప్రెజర్ బోయపాటిపై బాగానే ఉంది.

పైగా పెద్ద చిత్రాల మధ్యలో వస్తుండడంతో.. మూవీలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సి ఉంటుంది. ఈ సినిమాకి ముందు బన్నీ డీజే.. వెనక మహేష్ స్పైడర్ లు షెడ్యూల్ అయి ఉన్నాయంటే.. బెల్లంకొండ సినిమాపై ఎంతటి ఒత్తిడి ఉంటుందో అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి డబ్బింగ్ పనులు మొదలయినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/