Begin typing your search above and press return to search.

ఎంతమందికి చెప్పినా తప్పులేదు -బోయపాటి

By:  Tupaki Desk   |   30 April 2016 5:46 AM GMT
ఎంతమందికి చెప్పినా తప్పులేదు -బోయపాటి
X
ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను.. సరైనోడుతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. తన 12 ఏళ్ల కెరీర్ లో బోయపాటి 6 సినిమాలు తీయగా.. అందులో 5 బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం ఓ అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. అయితే.. ఇకపై మాత్రం కొంచెం స్పీడ్ పెంచుదామని అనుకుంటున్నాడట ఈ దర్శకుడు. ప్రతీ సినిమాకి తను చాలా హోమ్ వర్క్ చేస్తానని, అదే తన ఫస్ట్ ఫిలిం అన్నంతగా కష్టపడతానని చెబుతున్నాడు బోయపాటి.

సరైనోడు కోసం అల్లు అర్జున్ ని ఒప్పించడానికి చాలామందికే కథ చెప్పాడనే రూమర్ ఒకటి ఉంది. దీనిపై స్పందించిన బోయపాటి.. 'చాలామందికి కాదు, కొంతమందికి చెప్పాను. అల్లు అర్జున్ - అతని ఫ్రెండ్ బన్నీ వాసు - అల్లు అరవింద్ - అరవింద్ గారి సోదరి.. ఆమెకు సినిమాపై చాలా నాలెడ్జ్ ఉంది. ఇందులో తప్పేమీలేదు. నేను ఏ కథ రాసినా మా జాయింట్ ఫ్యామిలీలోని అందరికీ కథ నేరేట్ చేస్తాను. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను.' అని చెప్పాడు బోయపాటి శ్రీను.

సరైనోడు స్టార్ట్ చేసే ముందు అంతకుముందు బన్నీ నటించిన 12 సినిమాలను వరుసగా చూసేశాడట. అందుకే.. అప్పటివరకూ కనిపించనంత విభిన్నంగా చూపించేందుకు అవకాశం లభించిందని అంటున్నాడు. ప్రతీ యాక్టర్ కి తమ కేరక్టర్ - స్క్రీన్ ప్రెజెన్స్ పై పూర్తి క్లారిటీ ఉందని, ఎలాంటి ఇగో సమస్యలు లేవని చెప్పిన బోయపాటి - త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.