Begin typing your search above and press return to search.

బోయపాటి మళ్లీ అదే మాట

By:  Tupaki Desk   |   12 Jan 2019 10:58 AM GMT
బోయపాటి మళ్లీ అదే మాట
X
యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా పేరు దక్కించుకున్న బోయపాటి దర్శకత్వంలో స్టార్‌ హీరోలు కూడా ఆసక్తితో నటించేందుకు ముందుకు వస్తారు. యాక్షన్‌ ఇమేజ్‌ కోరుకునే హీరోలు బోయపాటిని ఆశ్రయిస్తారని చెప్పడంలో సందేహం లేదు. అయితే తాజాగా రామ్‌ చరణ్‌ తో ఈయన చేసిన వినయ విధేయ రామ చిత్రం మాత్రం మరీ ఊర మాస్‌ అయ్యింది. మాస్‌ ఆడియన్స్‌ కు కూడా బాబోయ్‌ అనిపించేలా ఈయన సీన్స్‌ ఉన్నాయి. చరణ్‌ ఈయనపై చాలా నమ్మకంను పెట్టుకుని ఈ చిత్రం చేశాడు. కాని బోయపాటి మాత్రం నిరాశ పర్చాడు. ఇండస్ట్రీలో ఫ్లాప్‌ లు అనేవి కామన్‌, ఒక్క ఫ్లాప్‌ తో బోయపాటి క్రేజ్‌ తగ్గేదేం కాదు. ఇప్పుడు బోయపాటి తదుపరి చిత్రం ఎవరితోనై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అదే విషయాన్ని బోయపాటిని అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వకుండా చిరంజీవి గారితో సినిమా చేయాల్సి ఉంది, బాలయ్య బాబుతో త్వరలోనే సినిమా చేయబోతున్నాను, మహేష్‌ తో సినిమా కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నాను, మహేష్‌ డేట్స్‌ ఇస్తే వెంటనే మొదలెట్టేసుడే, అఖిల్‌ తో కూడా సినిమా ఉంటుందంటూ చెబుతున్నాడు. అల్లు అర్జున్‌ తో ఈయన చేసిన సరైనోడు చిత్రానికి ముందు కూడా ఈ నాలుగు పేర్లు చెప్పాడు. తీరా బన్నీతో చేశాడు. ఆ తర్వాత జయ జానకి నాయకకు ముందు ఇలాగే చెప్పాడు.

వినయ విధేయ రామ చిత్రం తర్వాత అదే మాట చెప్పాడు. మరి ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి. వినయ విధేయ రామ ఫలితంతో హీరోలు కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. అయితే మంచి కథతో బోయపాటి వెళ్లే ఏ హీరో అయినా ఆలోచించొచ్చు. అయితే బోయపాటి ఈ షాక్‌ నుండి తేరుకుని తర్వాత సినిమాను విడుదల మొదలు పెట్టేందుకు కాస్త సమయం అయితే పట్టే అవకాశం ఉంది.