చిరు దగ్గర నుండి ఫోనొచ్చిందట

Sun Aug 13 2017 12:34:29 GMT+0530 (IST)

ఇప్పుడు ఎవరన్నా దర్శకుడికి తమ తదుపరి సినిమాల హీరోలు ఫోన్ చేసి పొగిడితే ఎలా ఉంటుంది? అబ్బా అదిరిపోతుంది. ఇలాంటి ఫోన్స్ కాల్స్ కారణంగానే ఎన్నో సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి. సుబ్రమణ్యం ఫర్ సేల్ చూసి.. ఫోన్ చేసి మరీ బన్నీ దర్శకుడు హరీశ్ శంకర్ ను పొగిడేశాడట. దానితో వెంటనే డిజె దువ్వాడ జగన్నాథం వర్కవుట్ అయ్యింది. అలాగే ఇప్పుడు బోయపాటి శ్రీను కు కూడా ఒక హీరో నుండి ఫోన్ వచ్చింది.అసలు 150వ సినిమాను చేస్తున్నప్పుడే.. 151వ సినిమాను బోయపాటి శ్రీనుతో చేస్తారని టాక్ వచ్చింది. కాని మ్యాటర్ ఏంటంటే.. మధ్యలో సురేందర్ రెడ్డి బాగా నచ్చేయడం.. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ర్కిప్టు కాస్త గట్టిగా రెడీ అవ్వడంతో.. మెగాస్టార్ చిరంజీవి అటువైపే మొగ్గారు. అయితే ఈ సినిమా పూర్తయ్యాక మరో సినిమాను వెంటనే బోయపాటి డైరక్షన్ లో మొదలెడతారేమో చూడాలి. అయితే ఇప్పుడు జయ జానక నాయక సినిమాకు బి-సి సెంటర్లలో వస్తున్న స్పందన చూసి చిరంజీవి చాలా ఎక్సయిట్ అయ్యారట. వెంటనే ఆయన బోయపాటికి ఫోన్ చేసి అభినందించారట. దీనితో మనోడు కూడా బాగా ఎక్సయిట్ అవుతున్నాడు.

మెగాస్టార్ తో బోయపాటి సినిమా అంటే ఖచ్చితంగా ఇంకో ఏడాది పడుతుంది. ఉయ్యాలవాడ పూర్తవ్వడానికి ఆ సమయం కావాలి కదా. మరి ఈ సినిమా మొదలెట్టేలోపు బాలయ్యతోనో అఖిల్ తోనో బోయపాటి మరో సినిమా పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడట.