Begin typing your search above and press return to search.

హంసలదీవి అసలు ఛాయిసే కాదు

By:  Tupaki Desk   |   21 Aug 2017 5:42 AM GMT
హంసలదీవి అసలు ఛాయిసే కాదు
X
ఇప్పుడు 'జయ జానకి నాయక' సినిమాను చూసినోళ్ళు చాలామంది మాట్లాడుకునే ఒకటే టాపిక్.. హంసల దీవిలో తీసిన ఆ ఫైట్ గురించే. ఎందుకంటే సముద్ర అలలు ఎగసిఎగసి పడుతుంటే.. పక్కనుండి కృష్ణమ్మ సందడితో హడావుడిగా సముద్రంలో కలుస్తుంటే.. ఆ సీన్ చాలా డిఫరెంట్ గా ఉంది. పైగా స్లో మోషన్లో స్పీడ్ కట్టింగ్ లో బోయపాటి శ్రీను మరియు సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ ఆ సీన్ ను తెరకెక్కించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెకండాఫ్‌ లో ఆ ఒక్క ఫైటుతో మొత్తంగా సినిమా రేంజే మారిపోయింది.

కాని విచిత్రం ఏంటంటే.. అసలు బోయపాటికి ఈ లొకేషన్ గురించి తెలియనే తెలియదట. అలాంటి బీచ్ ఒడ్డున ఒక ఫైట్ తీయాలి.. లేదంటే గంగానది ఒడ్డున కాశీలో తీయాలి అనుకుంటే.. మనోడు బ్యాంకాక్ నుండి గోవా వరకు.. కాశి నుండి ఇతర ప్రదేశాల వరకు.. చాలాచోట్ల రెక్కీ చేశాడట. చివరకు కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కృష్ణమ్మ పరవళ్లను చూడ్డానికి వెళ్ళి.. అరే ఇదేంటి అదిరిపోయింది అనుకున్నాడట. అలా చూసిన మరుక్షణం అక్కడే షూటింగ్ చేయాలని ఫిక్సయ్యాడట. దానితో ఏకంగా 13 రోజుల పాట 4 కోట్లు ఖర్చుపెట్టి ఆ ఎపిసోడ్ ను రూపొందించాడని చెప్పుకొచ్చాడు. ఒకేసారి 50 హోమాలు జరుగుతున్నట్లు సెట్ వేసి.. వాటర్ లో తడిసినా కూడా షాక్కొట్టని కరెంట్ వైర్లను.. 8 జనరేట్లర్లను అమర్చి.. 40 మంది ఆర్టిస్టులు.. 100 మంది ఫైటర్లు.. 100 మంది బాడీ బిల్డర్లు.. 150 మంది జూనియర్ ఆర్టిస్టులూ.. మొత్తంగా 600+ మంది టీమ్ అక్కడ చిత్రీకరణలో పాలుపంచుకున్నారు. అదంతా తెర మీద చూస్తే.. ఏ రేంజులో ఉందో మనకు తెలిసిందే.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కు కొత్త కిక్ ఇచ్చింది మాత్రం దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అనే చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు రీ-రికార్డింగ్ కూడా చితక్కొట్టేశాడు. అందుకే ధియేటర్లో ఆ ఎపిసోడ్ చూసినప్పుడు వెంట్రుకలు గగుర్పొడిచాయ్. అది సంగతి.