Begin typing your search above and press return to search.

పాడుచేయకుండా బోయపాటి బతకించాడు

By:  Tupaki Desk   |   27 July 2016 1:30 PM GMT
పాడుచేయకుండా బోయపాటి బతకించాడు
X
పాత కాలంలో వచ్చిన క్లాసిక్ సినిమాలను ఇప్పుడు రీమేక్ చేస్తే ఆ తీరే వేరు. కాకపోతే అలా చేసి ఆ కథలను ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా మార్చేంత తీరిక లేక.. ఈ రీమేకుల జోలికి ఎవ్వరూ వెళ్ళట్లేదులే. కాకపోతే కోన వెంకట్ వంటి రైటర్లు మాత్రం 'శంకరాభరణం' వంటి క్లాసిక్ సినిమాల టైటిళ్ళను మాత్రం తమ కామెడీ సినిమాల కోసం వాడేసుకుంటున్నారు. సదరు సినిమాల్లోని కంటెంటుకూ ఈ క్లాసిక్ టైటిళ్ళకూ ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా.. ఆ టైటిళ్లను వాడేసుకుని క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే కోన అప్పట్లో శంకరాభరణం డిజాష్టర్ అయ్యాక చాలా క్రిటిసిజం ఎదుర్కొనాల్సి వచ్చింది.

ఇప్పుడు బోయపాటి శ్రీను విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ తో తీస్తున్న సినిమా టైటిల్ ఉంది చూశారూ.. ఆ విషయంలో ఒక ఆసక్తికర మ్యాటర్ తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు ''అల్లుడు బంగారం'' అనే టైటిల్ కంటే.. బోయాపటి వేరే టైటిల్ పైనే మక్కువ చూపించాడట. ఈ సినిమాకు ''పుష్పక విమానం'' అంటూ పేరు పెట్టాలని బోయపాటి ఉవ్విళ్ళూరి.. మాస్‌ లో పెద్దగా వర్కవుట్ అవ్వదేమోనని భయపడి.. చివరకు ''అల్లుడు బంగారం'' అనే టైటిల్ పైనే ఇంట్రెస్టు చూపిస్తున్నాడు బోయపాటి. అయినా బోయపాటి తీసే మాస్‌ సినిమాలకు ఇలా పుష్పక విమానం అంటూ కమల్ హాసన్‌ క్లాసిక్ సినిమా టైటిల్ ను పెట్టడం ఎంతవరకు న్యాయం?? పోనివులే బోయపాటి బ్రతికించాడు ఆ పాత టైటిల్ ను పాడుచేయకుండా అంటున్నారు సినిమా లవర్స్!!