Begin typing your search above and press return to search.

స్టార్లను లైన్లో పెడుతన్న బోయపాటి

By:  Tupaki Desk   |   24 May 2016 11:50 AM GMT
స్టార్లను లైన్లో పెడుతన్న బోయపాటి
X
సరైనోడు చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఇప్పటికే 70 కోట్ల షేర్ వసూళ్లను సాధించిన ఈ మూవీ.. ఇంకా మంచి కలెక్షన్స్ నే రాబడుతోంది. అయితే ఈ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ సాధించిన వ్యక్తి దర్శకుడు బోయపాటి శ్రీను. పైగా లెజెండ్ - సరైనోడు.. ఇలా వరుస హిట్స్ కొట్టడంతో ఈయనపై బాధ్యతలు మరింతగా పెరిగాయి.

ఇప్పటివరకూ బోయపాటి చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే. కానీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ని మాత్రం ఓ కొత్త కుర్రాడితో చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన బెల్లంకొడం శ్రీనివాస్ తోనే బోయపాటి నెక్ట్స్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం టాప్ రేంజ్ కి చేరుకున్న తన ఇమేజ్ ను.. బెల్లంకొండ లాంటి కుర్రాడితో తగ్గించుకోవడం బోయపాటికి ఇష్టం లేదు. కానీ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయిపోయాయి.

అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయనున్న మూవీకి స్టార్ వాల్యూను జత చేసేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు స్టార్ హీరోలతో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించేలా స్క్రిప్ట్ ను మార్చుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో తలపెట్టిన మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా.. ఇప్పుడు ఓ ఇద్దరు యంగ్ స్టార్ హీరోలతో గెస్ట్ రోల్స్ చేయించేలా స్క్రిప్ట్ మార్చుతున్నాడట బోయపాటి శ్రీను.