Begin typing your search above and press return to search.

బోయపాటి ఇప్పుడేం చేస్తాడు?

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:30 PM GMT
బోయపాటి ఇప్పుడేం చేస్తాడు?
X

గ్యాప్ లేకుండా సినిమాలు చేయడంలో దర్శకుడు బోయపాటి శ్రీను బాగానే పేరు సంపాదించాడు. ఇతడితో సినిమా చేస్తే మాస్ ఇమేజ్ మరింతగా పెరగడం ఖాయం అనే నమ్మకం ఏర్పడడంతో.. అనేక మంది హీరోలు బోయపాటితో సినిమాకి ఆసక్తిగానే ఉన్నారు.

అయితే.. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. చెర్రీ ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టినా.. అప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి జోరు చూపించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు క్లైమాక్స్ వరకూ వచ్చేశాడు. ఈ నెలాఖరుకు క్లైమాక్స్ ఫైట్ కంప్లీట్ చేసేస్తాడు. వచ్చే నెలలో ఫారిన్ షెడ్యూల్ వేసుకుని.. పాటలను కూడా పూర్తి చేసేయనున్నాడు. అంటే ఇంకో నెలా నెలన్నరలో #RC12 షూటింగ్ మొత్తం అయిపోతుందన్నమాట. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం సంక్రాంతికి అన్నాడు. మరి ఈ ఐదు నెలలు బోయపాటి ఏం చేస్తాడు? అన్నదే పాయింట్.

ఐదు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండవనే సంగతి తెలిసిందే. మహా అయితే.. ఓ నెల పడుతుంది. ప్రచారానికి ఇంకో పక్షం రోజులు వేసుకున్నా.. ఎలా లేదన్నా 3 నెలలకు పైగానే సమయం ఖాళీగా ఉంటుంది. సహజంగా అయితే.. ఈ టైంలో ఓ సినిమా తీసేయగలడు ఈ డైరెక్టర్. కానీ.. ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులలో భాగమైన బాలయ్య కూడా ఖాళీగా లేరు. కాకపోతే.. జయ జానకి నాయకు టైపులో.. ఎవరన్నా చిన్న హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేసుకునే ఛాన్సులు ఉన్నాయనే టాక్ మాత్రం బాగానే వినిపిస్తోంది.