విధేయ రాముడి ఇంటర్వెల్ ఫైట్ రచ్చ రచ్చే...!

Sun Dec 09 2018 22:39:58 GMT+0530 (IST)

బోయపాటి శ్రీను అంటే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అటువంటి యాక్షన్ దర్శకుడికి రామ్ చరణ్ వంటి మాంచి యాక్షన్ హీరో తోడైతే ఇంకేమైనా ఉందా.. సినిమా అంతా కూడా మాస్ మసాలే అని చెప్పుకోవచ్చు. పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంటర్వెల్ ఫైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ ఫైట్ ను దర్శకుడు బోయపాటి చాలా శ్రద్ద పెట్టి చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు - 100 మంది ఫైటర్స్ ఈ షూట్ లో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా మొత్తం ఫైట్స్ ఒకెత్తు అయితే ఇంటర్వెల్ కు ముందు ఫైట్ ఒకెత్తు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా నచ్చే విధంగా ఫ్యామిలీ నేపథ్యంలోని సీన్స్ ఉంటాయని టీజర్ - పాట చూస్తుంటే అనిపిస్తుంది.

షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రంను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వినయ విధేయ రామ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించిన విషయం తెల్సిందే. చరణ్ కెరీర్ లో ఇది మరో విజయంగా నిలుస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.