బోయపాటి.. నువ్వు మారాలి బాబాయ్

Sat Jan 12 2019 23:00:01 GMT+0530 (IST)

వినయ విధేయ రామ విడుదలకు జస్ట్ 2 రోజుల ముందు తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు బోయపాటి. తన USP యాక్షన్ అని జానర్ ఏదైనా అందులో యాక్షన్ మిస్ అవ్వనని ఘనంగా ప్రకటించుకున్నాడు. చివరికి బయోపిక్ తీసినా అందులో తన మార్క్ యాక్షన్ ఉంటుందని చెప్పుకున్నాడు. కట్ చేస్తే వినయ విధేయ రామ సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ బెడిసికొట్టింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బోయపాటినే విమర్శిస్తున్నారు. ఈ దెబ్బతో బోయపాటి మారాలంటూ పోస్టులు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది.నిజమే.. బోయపాటి మారే టైమ్ వచ్చింది. ఇది నరుక్కునే టైమ్ కాదు. యాక్షన్ లో కూడా కొత్తదనం చూపించాల్సిన సమయం. సింహా సినిమాలో నరికే సీన్లు చూపిస్తే జనాలు చప్పట్లు కొట్టారు. లెజెండ్ లో నరికితే ఈలలు వేసి గోల చేశారు. కానీ అదే నరుకుడు కాన్సెప్ట్ వినయ విధేయ రామలో వర్కవుట్ కాలేదు. అంటే ప్రేక్షకుల అభిరుచి మారిందని దీనర్థం.

దీన్ని అర్థం చేసుకొని ట్రెండ్ కు తగ్గట్టు బోయపాటి కూడా తనను తాను మార్చుకుంటే బెటర్. లేదు ఇదే నా ట్రేడ్ మార్క్ ఇలానే సినిమాలు చేస్తానంటే మాత్రం ఈ దర్శకుడు మరో డిజాస్టర్ ఫేస్ చేయాల్సి రావొచ్చు. ఎందుకంటే వినయ విధేయ రామలో చూపించిన ఆ కొట్టుకోవడాలు నరుక్కోవడాల్ని ఆడియన్స్ ఇప్పుడు అంగీకరించడం లేదు. యాక్షన్ లో కూడా చాలా రకాలుంటాయి. యాక్షన్ అంటే నరుక్కోవడమే తలలు తెగిపడడమే అనే భ్రమ నుంచి బోయపాటి ఎంత తొందరగా బయటకొస్తే అంత మంచిది.