Begin typing your search above and press return to search.

బోయపాటికి చరణ్ సవాల్

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:30 AM GMT
బోయపాటికి చరణ్ సవాల్
X
రామ్ చరణ్ తో రంగస్థలం తర్వాత సినిమా తీస్తున్న దర్శకుడిగా బోయపాటి శీనుపై కనిపించని ఒత్తిడి చాలానే ఉంది. సుకుమార్ కు రంగస్థలం మొదలు పెట్టే టైంలో ఇది లేదు. కారణం అప్పటికి చరణ్ ధృవ రూపంలో ఒక డీసెంట్ హిట్ తో పాటు వెనకాల ఓ రెండు డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. సో సుకుమార్ కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ రిస్క్ చేసి చెర్రీని కొత్తగా చూపించి ఎవరూ ఊహించని స్థాయిలో ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న బోయపాటి శీను సినిమా దాని కంటే మెరుగ్గా ఆడాలని ఫాన్స్ రంగస్థలం కంటే బాగుండాలని సగటు ప్రేక్షకులు ఆశించడం సహజం. అదే జరుగుతోంది కూడా. మొన్న ఏదో ఇంటర్వెల్ ఫైట్ 500 మందితో తీశారు అన్న వార్తకే మెగా ఫాన్స్ ఊగిపోతున్నారు. బోయపాటి డైరెక్షన్ లో చరణ్ మాస్ అవతారం ఏ రేంజ్ లో ఉంటుందా అని అప్పుడే ఊహాగానాలు చేసుకోవడం మొదలుపెట్టారు. బోయపాటి మొదటి సినిమా భద్ర మొదలుకుని గత ఏడాది వచ్చిన జయజానకి నాయక దాకా అన్ని మాస్ ఫార్ములా సినిమాలే. తన స్కూల్ నుంచి బయటికి వచ్చి శీను ఏ సినిమా తీయలేదు.

ఇప్పుడు చరణ్ సినిమా జరుగుతున్న తీరు చూస్తుంటే ఇది కూడా ఫక్తు మసాలా అంశాలతో కూడిన సినిమాలాగే అనిపించడం కామన్. కానీ బోయపాటి మాత్రం తనదైన స్టైల్ లో బాబు ఈ సారి మనం రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాం అని చెప్పినట్టు టాక్. అది ఏ దర్శకుడికైనా ఉండే నమ్మకం కనక దాన్ని ప్రత్యేకంగా చూడలేం. ఈ సినిమాకున్న అతి పెద్ద అనుకూలత విడుదల తేదీ. సంక్రాంతి సీజన్ కి వస్తున్నాం అని అధికారికంగా ప్రకటించేసారు కాబట్టి వెనక్కు తగ్గే ఛాన్స్ లేదు. గతంలో రామ్ చరణ్ నాయక్-ఎవడు ఈ సీజన్ లోనే వచ్చి మంచి వసూళ్లు దక్కించుకున్నాయి. కంటెంట్ రొటీన్ గానే ఉన్నా సంక్రాంతి సీజన్ కాబట్టి భారీగా వర్క్ అవుట్ చేసుకున్నాయి. ఇప్పుడు బోయపాటి సినిమాను కూడా అదే స్ట్రాటజీతో విడుదల చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడానికి వేరే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 80ల నాటి గ్రామీణ వాతావరణం-చరణ్ ని మొదటిసారి చెవిటివాడిగా చూపించడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ అలాంటివి బోయపాటి సినిమాలో లేవు. సో హీరోయిజంని ఎలా ఎలివేట్ చేసి చరణ్ ని చూపిస్తాడా అనే దాన్ని బట్టే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. చిరంజీవి బర్త్ డే కి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్. ఒకవేళ సైరా లుక్ కూడా అదే రోజు ప్లాన్ చేస్తే మరో తేదీకి వీటిని వాయిదా వేస్తారు.