బోయపాటి దెబ్బకు సెర్చ్ పెరిగింది

Sat Aug 12 2017 12:55:26 GMT+0530 (IST)

ఇప్పుడు సడన్ గా ఒక ఏరియా గురించి విపరీతంగా సెర్చింగ్ చేస్తున్నారు జనాలు. అదే ''హంసలదీవి''. కృష్ణా నది వెళ్ళి సముద్రాన్ని కలసే చోట.. కృష్ణా జిల్లాలో ఈ దీవి ఉంది. గోదావరి కలిసే చోట కాకినాడలో హోప్ ఐలాండ్ ఉన్నట్లు.. ఇక్కడ హంసలదీవి కూడా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా తెలుగు సినిమా అభిమానులు చాలామంది ఈ దీవి గురించి తెగ సెర్చింగ్ చేస్తున్నారు. ఎందుకో చూడండి.

అయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నుండి 25 కిలోమీటర్ల దూరంగా ఉన్న హంసలదీవి గురించి ఇంత సెర్చ్ ఎందుకు పెరిగిందో తెలుసా? నిన్ని రిలీజైన ''జయ జానకి నాయక'' సినిమాలో ఈ దీవిలో ఒక ఫైట్ తీశాడు బోయపాటి శ్రీను. ఆల్రెడీ ట్రైలర్ లో  ఒక బీచ్ ఫైట్ సీన్ ఉంది చూశారూ.. అదే ఇది. పైగా ఈ ఫైట్ ను చూపించే ముందు.. అక్కడ ఈ దీవి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తూ ఒక ఏరియల్ షాట్లో మొత్తం ఆ ఏరియా అంతా చూపిస్తూ.. ఒక బిట్ సాంగ్ రూపంలో కృష్ణమ్మ గురించి చెప్పాడు. ఇక సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి ఈ ఏరియా విజువల్స్ ను అద్భుతంగా కెమెరాలో ఒడసిపట్టాడు. దానితో ఈ ఫైట్ అంతా మ్యాజిక్ లా ఉంది. ఆ దెబ్బతో అసలు హంసలదీవి నిజంగానే ఉందా.. ఉంటే కనుక దాని దగ్గరకు ఎలా వెళ్ళాలి అంటూ జనాలు వెతకడం స్టార్ట్ చేశారు.

మొత్తానికి ఒక సినిమాలో చిన్న బిట్టుగా చూపిస్తే చాలు.. దాని గురించి ప్రజల్లో ఆసక్తి రేకెత్తించవచ్చు అంటూ బోయపాటి మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఒకప్పుడు స్విట్జర్ ల్యాండ్ వంటి దేశాలను మన సినిమాలు ఇలాగే పాపులర్ చేశాయి. అదేదో మన ఊళ్లలోని లొకేషన్లను పాపులర్ చేసుకుంటే ఎంత బావుంటుందో చూడండి. మొన్న ఫిదా సినిమాలో బాన్సువాడ - బోథన్ (నిజామా మాద్).. ఇప్పుడు జయ జానకి నాయకలో హంసల దీవి.. సూపర్ గురూ!!