శీనుకున్న నమ్మకం అదే

Tue Feb 12 2019 10:50:19 GMT+0530 (IST)

వినయ విధేయ రామ ఫలితం పాజిటివ్ గా వచ్చి ఉంటే ఇప్పుడు బోయపాటి రచ్చ ఓ రేంజ్ లో ఉండేది. డేట్ల కోసం హీరోల ఫోన్లు తమ బ్యానర్ లో చేయమని అడిగేందుకు నిర్మాతల క్యూ కామన్ గా కనిపించేవి. అయితే జరిగింది వేరు. ఆ సినిమా ఇంత దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవడంలో తప్పుల గురించి అందరి వేళ్ళు శీను వైపే వెళ్తున్నాయి. దానికి తోడు నిర్మాత దానయ్యతో గొడవ జరిగిందన్న వార్త నిజమో కాదో కానీ ఒకరకంగా ఈ ప్రచారం కూడా శీనుని ఇబ్బందిలో పడేసింది.ఇప్పుడు తన దృష్టంతా బాలకృష్ణతో చేయబోయే 105 మూవీ మీదే ఉంది. ఎప్పటిలాగే బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నా ఫుల్ స్క్రిప్ట్ చూసాక చూద్దామని బాలయ్య చెప్పడంతో బోయపాటి శీను అదే పనిలో బిజీగా ఉన్నాడని టాక్ ఉంది. ఈ కాంబినేషన్ లో ఇప్పటిదాకా వచ్చిన సింహా లెజెండ్ లు బ్లాక్ బస్టర్లు కాగా ఇదో మూడోసారి అవుతుంది. సో హ్యాట్రిక్ మూవీగా పరిగణించడం సహజం.

అయితే ఇది టేకప్ చేయడం అంచనాలు పెట్టుకున్నంత ఈజీ కాదు. బోయపాటి శీనుపై పైకి కనిపించినా కనిపించక పోయినా ముందరి సినిమా డిజాస్టర్ తాలూకు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బాలకృష్ణతో బి గోపాల్ అప్పట్లో సమరసింహారెడ్డి-నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాక పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి నాసిరకం సినిమా ఇస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. కాంబో ఉంటె సరిపోదు బలమైన కథ ఉండాలనే పాఠం నేర్పించింది. కాబట్టి ఇప్పుడు బోయపాటి శీనుని చూసి అభిమానులు సింహా లెజెండ్ ల లెక్కలు చెప్పుకుని మురిసిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా వినయ విధేయరామతో పడ్డ మరక పూర్తిగా పోవాలంటే శీను సినిమా మాములుగా ఉంటే సరిపోదు. అందుకే కొంత ఆలస్యం తప్పేలా  లేదు.