మామ్ శ్రీదేవి దీవెనలతో తళా 59

Sat Dec 15 2018 14:14:30 GMT+0530 (IST)

మామ్ శ్రీదేవి అంతర్థానమై స్వర్గ లోకంలో విహరిస్తున్నారు. దేవేంద్రు ని ఆజ్ఞలతో దేవలోకాన్ని రంజింపజేస్తున్నారు. అయితే భూమ్మీద బోనీకపూర్ ఏం చేస్తున్నట్టు? ఇదిగో ఇలా సినిమాలు తీస్తూ సినీ ప్రియుల్ని తరింపజేస్తున్నారు. తళా అజిత్ హీరో గా ఆయనో సినిమా తీస్తున్నారు. ఇది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాతో పాటు అజిత్ హీరో గా వేరొక సినిమాని ఆయన నిర్మించనున్నారు. ఇక పై తమిళం సహా దక్షిణాది భాషలన్నిటా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అజిత్ సినిమాలు అంటే తెలుగులోనూ భారీగానే రిలీజవుతున్నాయి. అంటే ఇప్పుడు తెలుగు- తమిళ్- హిందీ త్రిభాషా చిత్రాలకు బోనీ ప్లాన్ చేస్తున్నారని భావించవచ్చు.తళా అజిత్ కథానాయకుడి గా హెచ్.వినోద్ దర్శకత్వంలో అత్యంత భారీ చిత్రం ఈ శుక్రవారం ప్రారంభమైంది. దేవుని చిత్రపటాల పై పూజా కార్యక్రమాలు చేస్తున్న బోనీ ఫోటోల్ని ప్రముఖ పీ ఆర్ వో బి ఏ రాజు ట్వీట్ చేశారు. ఈ పూజాకార్యక్రమాల్లో బోనీ మెడలో వేసిన పూలదండతో ఆయన కొత్తగా కనిపించారు. తళా 59 మామ్ శ్రీదేవి ఆశీస్సులతో మొదలైంది. అసలు తళాకు శ్రీదేవి లింకేంటి? అంటే ఇదివరకూ మామ్ నటించిన `ఇంగ్లీష్ వింగ్లీష్` చిత్రంలో అజిత్ ఓ అతిధి పాత్రలో నటించారు. అప్పుడే అజిత్ వ్యక్తిత్వం నచ్చి తనతో సినిమాలు నిర్మించాల్సింది గా బోనీకి శ్రీదేవి సూచించారట. అందుకే ఇప్పుడిలా ఆ అలయెన్స్ లో సినిమా మొదలైంది.

అన్నట్టు బోనీ జీ శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తానని మాటిచ్చారు. కానీ దేవత వెళ్లి చాలా కాలమే అయిపోతోంది. ఇటీవలే ఒకటో వర్ధంతి కూడా చేసేశారు. అయినా ఇంతవరకూ ఆ బయోపిక్ గురించిన ఒక్క అప్ డేట్ కూడా లేదు. ఇప్పటివరకూ వేరొక దర్శకుడెవరూ శ్రీదేవి పై బయోపిక్ గురించిన మాటెత్తకపోవడం పైనా అభిమానుల్లో అసహనం నెలకొంది. వీటన్నిటికీ బోనీజీ భవిష్యత్ లో సమాధానం చెబుతారేమో చూడాలి.