Begin typing your search above and press return to search.

బొమ్మ అదిరింది.. కానీ అందాలే?

By:  Tupaki Desk   |   21 Nov 2017 7:52 AM GMT
బొమ్మ అదిరింది.. కానీ అందాలే?
X
టాలీవుడ్ లో ఒక్కోసారి ఐరెన్ లెగ్స్ హీరోయిన్స్ ఉండడమే కాదు. గోల్డెన్ లెగ్స్ హీరోయిన్స్ కూడా చాలా మంది వస్తుంటారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఒక గోల్డెన్ లెగ్ పిల్ల తన అదృష్టాన్ని తెగ చూపించేస్తోంది. ఆమె ఎవరో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది.కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో పరిచయం అయిన సెక్సీ బ్యూటీ మెహ్రీన్ పీర్జాద ప్రస్తుతం మంచి సక్సెస్ రేట్ తో కొనసాగుతోంది.

అమ్మడి లెగ్గు పడితే చాలు మొన్నటి వరకు దురదృష్టంతో సతమతమైన హీరోలు కూడా హిట్లు కొట్టేశారు. శర్వానంద్ రాధా పరాజయం తర్వాత మహానుభావుడు సినిమాతో హిట్టు అందుకున్న విషయం తెలిసిందే. ఇక మాస్ రాజా రవితేజ కెరీర్ కి రాజా ది గ్రేట్ తో మళ్లీ బూస్ట్ వచ్చింది. ఈ రెండు సినిమాల్లో అమ్మడి అందాలే హైలెట్. ఒక ప్రక్కన కేరాఫ్ సూర్యతో ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా మెహ్రీన్ అదృష్టాన్ని పంచుకోబోతున్నాడు. అమ్మడు జవాన్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే రీసెంట్ గా సినిమాలోని బొమ్మ పడిందే సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే పాటలో మెహ్రీన్ చాలా బొద్దుగా కనిపిస్తోంది. ఫస్ట్ టైమ్ ఒక మాస్ సాంగ్ లో స్టెప్పులు వేసింది. హాట్ గా కూడా కనిపిస్తోంది ఈ వైట్ బ్యూటీ. సాయితో పోటీ పడి రొమాన్స్ చేసింది. మరి ఈ సినిమాలో ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. బివిఎస్.రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించాడు.