Begin typing your search above and press return to search.

బాలీవుడ్ సెక్స్ రాకెట్ బట్టబయలు

By:  Tupaki Desk   |   16 Nov 2018 11:35 AM GMT
బాలీవుడ్ సెక్స్ రాకెట్ బట్టబయలు
X
బాలీవుడ్ బడా సెక్స్ రాకెట్ ను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. డాన్స్ ప్రోగ్రామ్ ల పేరుతో అమ్మాయిలను విదేశాలకు పంపుతున్న ఓ మహిళా కొరియోగ్రాఫర ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇటీవల కెన్యా ప్రభుత్వం అక్రమంగా దేశానికి వచ్చిన ఓ మహిళను పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మహిళా కొరియోగ్రాఫర్‌ ఆగ్నెస్ హామిల్టన్(56) అంధేరిలోని లోఖండ్ వాలాలో డాన్స్ క్లాసులు నిర్వహిస్తుంది. కొత్తగా నటీనటులవ్వాలనుకునే అమ్మాయిలను బ్రెయిన్ వాస్ చేసి వ్యభిచారం రొంపిలోకి దింపుతుంది. ఆమె ఫేస్ బుక్ ప్రొఫైల్ ను పరిశీలించగా కొంతమంది బాలీవుడ్ నటులు - పొలిటీషియన్లతో దిగిన ఫోటోలు సైతం దర్శనమిస్తున్నాయి. ఆమె సూచనల మేరకు కెన్యాకు చేరుకున్న ఓ మహిళను పట్టుకున్న పోలీసులు విచారించగా - ఒక వ్యక్తి నైరోబి తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని బలవంతం చేసినట్లు పేర్కొంది.

బాలీవుడ్ చిత్రాలకు ఆగ్నెస్ హామిల్టన్ కొరియోగ్రాఫర్‌ గా కూడా పనిచేసింది. పలు చిత్రాల్లో నటించింది కూడా. భారత దేశం నుంచి మలేషియాకు అమ్మాయిలను డాన్స్ ప్రోగ్రాముల పేరుతో పంపుతున్నట్లు పోలీసులు గుర్తించి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.