Begin typing your search above and press return to search.

మాంత్రికుడి కోసం కరిగిస్తున్న జూనియర్

By:  Tupaki Desk   |   20 Feb 2018 11:32 AM GMT
మాంత్రికుడి కోసం కరిగిస్తున్న జూనియర్
X
త్రివిక్రమ్ తో సినిమా మొదలయ్యే లోపు.. ఎన్టీఆర్ బాగా సన్నబడిపోయేందుకు ట్రై చేస్తున్నాడనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టెయినర్ జోనర్ కావడంతో.. మళ్లీ బృందావనం నాటి లుక్ కోసం ఎన్టీఆర్ కష్టపడుతున్నాడన్నది వాటి సారాంశం. కానీ ఇప్పటివరకూ యంగ్ టైగర్ ఏ మాత్రం తగ్గలేదనే వాదన కూడా ఉంది. గతంలో ప్రస్తావనగానే ఉన్నపుడే ఈ విషయం బైటకు రావడంతోనే ఇలాంటి హంగామా నెలకొందట.

కొన్ని వారాల నుంచి జిమ్ లో తెగ వర్కవుట్స్ చేస్తున్నాడట జూనియర్. ఇప్పటివరకూ ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ..ఇప్పుడు ఓ వీడియో బైటకు వచ్చింది. ఇందులో లాయిడ్ స్టీవెన్స్ అనే పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో తెగ కష్టపడుతున్న జూనియర్ ఛాయామాత్రంగా కనిపిస్తాడు. విజువల్ పూర్తి క్లారిటీ లేదు కానీ.. ఆ స్టైల్ ను చూస్తే ఎన్టీఆర్ అనే సంగతి అర్ధమవుతుంది. ఇంతగా చెమటలు ఓడ్చడం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభమయ్యే చిత్రం కోసమే అనే సంగతి చెప్పాల్సిన పని లేదు.

అజ్ఞాతవాసి ఫ్లాప్ ఎఫెక్ట్ తో ఎన్టీఆర్ సినిమా ఆరంభం కావడం ఆలస్యం అయింది కానీ.. లేకపోతే ఈ పాటికే షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు రీ-ఎడిటెడ్ వెర్షన్ స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసుకున్నాడు త్రివిక్రమ్. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఫిజిక్ తగ్గించుకోవడంపై పూర్తిగా దృష్టి పెట్టాడు. ఈ ఇద్దరి తొలిసారిగా రాబోతున్న చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి