సీన్ రివర్స్.. సౌత్ ముందు స్టార్స్ క్యూ

Wed Dec 12 2018 11:16:36 GMT+0530 (IST)

తెలుగు- తమిళ చిత్రాల పరిధి- బడ్జెట్- మార్కెట్- వసూళ్లు ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా బాలీవుడ్ సినిమాలు చాలా దూరాన ఉండేవి. బాలీవుడ్ సినిమాల్లో నటించడంతోనే భారీ గుర్తింపు దక్కుతుందనే నమ్మకం. బాలీవుడ్ స్టార్స్ కు సౌత్ సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. పారితోషికం ఎక్కువ ఇవ్వరు- పెద్దగా గుర్తింపు రాదని హిందీ స్టార్స్ సౌత్ సినిమాల్లో నటించే వారు కాదు. ఇందంతా కొన్ని సంవత్సరాల క్రితం ముచ్చట.. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. సౌత్ సినిమాల స్థాయిని రాజమౌళి- శంకర్ లతో పాటు మరి కొందరు దర్శకులు ఎక్కడికో తీసుకు వెళ్లారు. ఈ మద్య కాలంలో బడ్జెట్ విషయంలో బాలీవుడ్ కంటే కూడా సౌత్ సినిమాలు ఆధిక్యంను కనబర్చుతున్నారు. అందుకే గతంలో సౌత్ లో నటించేందుకు ఆసక్తి చూపని పలువురు స్టార్స్ తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసే సౌత్ సినిమాల్లో నటించాలని బాలీవుడ్ స్టార్స్ కోరుకుంటున్నారు.

అందులో భాగంగానే అమితాబచ్చన్- అక్షయ్ కుమార్- విద్యాబాలన్- ఐశ్వర్యరాయ్- వివేక్ ఒబేరాయ్- నానా పటేకర్... ఇంకా పలువురు కూడా తెలుగు తమిళ చిత్రాల్లో నటించేందుకు ముందుకు వచ్చారు. ఇంకా ప్రముఖులు కూడా సౌత్ లో నటించడం ఖాయంగా తెలుస్తోంది. సౌత్ సినిమాల స్థాయి పెరిగిందనేందుకు ఇంతకు మించిన సాక్ష్యం అక్కర్లేదు. అమితాబచ్చన్ సైరాలో- ఎన్టీఆర్ లో విద్యాబాలన్- 2.ఓ లో అక్షయ్ కుమార్- విధేయ రామలో వివేక్ ఒబేరాయ్- అప్పుడు రోబోలో ఐశ్వర్యరాయ్‌లు నటించారు- నటించబోతున్నారు. బాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ స్టార్స్ కు టాలీవుడ్ నిర్మాతలు పారితోషికాలు ఇస్తున్నారు. అక్కడి కంటే కాస్త ఎక్కువగానే ఇస్తున్నారనే టాక్ ఉంది.