Begin typing your search above and press return to search.

ఫోకస్‌: సౌత్ మార్కెట్ పైనే కన్ను

By:  Tupaki Desk   |   28 Nov 2015 10:30 PM GMT
ఫోకస్‌: సౌత్ మార్కెట్ పైనే కన్ను
X
బాలీవుడ్ నిర్మాతల స్వరం మారుతోంది. తీరు మారుతోంది. గతంలో దక్షిణాది మార్కెట్ ని చిన్న చూపు చూసిన బాలీవుడ్ నిర్మాతలు.. ఇక్కడి మార్కెట్ సామర్ధ్యాన్ని అర్ధం చేసుకున్నారు. వరుసగా తమ సినిమాలను దక్షిణాది భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో.. తెలుగు - తమిళ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయింది.

ఇప్పుడు డిసెంబర్ 18న విడుదల కానున్న బాజీరావు మస్తానీ కూడా దక్షిణాది భాషల్లో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. ఇది చారిత్రాత్మక చిత్రం కావడంతో.. నేటివిటీ సమస్య ఉండదని, అందుకే పలు భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నామని, నిర్మాణ సంస్థ ఈరోస్ ప్రకటించింది. ఇది కొంతవరకు నిజమే అయినా.. సౌత్ మార్కెట్ లో సినిమా సామర్ధ్యాన్ని గుర్తించారనే విషయాన్ని మర్చిపోకూడదు. గతంలోనూ ఇలా కొన్ని బాలీవుడ్ మూవీస్ సౌత్ భాషల్లోకి వచ్చాయి. అయితే.. ఇది ఖాన్ త్రయానికే ఎక్కువగా పరిమితమైంది. అవి కూడా కొన్ని సినిమాలే వచ్చాయి.

ఇవి కాక ధూమ్ - క్రిష్ వంటి యాక్షన్ ప్యాక్డ్ సినిమాలను కూడా తెచ్చారు. కానీ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను క్యూలో పెట్టడం ఆలోచించాల్సిన విషయం. నిజానికి బాలీవుడ్ మూవీస్ ని డబ్బింగ్ చేయడం తేలికే కానీ.. వాటిని ఇక్కడి నేటివిటీకి దగ్గర చేయడం క్లిష్టమైన విషయం. అందుకే నిర్మాతలు డబ్బింగ్ విషయంలో దూరంగా ఉంటారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమ్ రతన్ ధన్ పాయో.. తమిళ్ వెర్షన్ కు 25 లక్షల కలెక్షన్ రాగా, తెలుగులో వచ్చిన ప్రేమలీలకు 3 కోట్ల వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో వచ్చే వందల కోట్లతో పోల్చితే ఇవి చిన్న అంకెలే అయినా.. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని డబ్బింగ్ కు సిద్ధపడుతున్నారు నిర్మాతలు.

హ్రితిక్ రోషన్ మూవీ క్రిష్ 3 - మొదటి ోజునే తెలుగులో 3 కోట్లు - తమిళ్ లో 2 కోట్లు పిండేసుకుంది. అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 కి మొత్తం 2.8 కోట్లు వచ్చాయి. షారూక్ ఖాన్ మూవీ హ్యాపీ న్యూ ఇయర్ కు తెలుగు వెర్షన్ ద్వారా 1.43 కోట్లు - తమిళ్ మార్కెట్ నుంచి 92 లక్షలు వచ్చాయి. ఈ మార్కెట్ క్రమంగా పెరుగుతుండడంతో... డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం బాజీరావు మస్తానీతో పాటు.. గుర్మీత్ సింగ్ నటించిన మెసెంజర్ ఆఫ్ గాడ్ 2 మూవీ కూడా... తెలుగు - తమిళ వెర్షన్స్ లో రిలీజ్ కానుంది