టాలీవుడ్ కి మళ్లీ బాలీవుడ్ భామలు

Mon May 14 2018 12:03:21 GMT+0530 (IST)

సౌత్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ అస్సలు ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఆఫర్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవు. చాన్స్ వస్తే రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా ఒప్పేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో సినిమాలో కంటెంట్ ని బట్టి ఒప్పుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మంచి హిట్ అందితే అన్ని వైపులా లాభం ఉంటుంది. పైగా తెలుగోళ్ల వీళ్లకు కోట్లలో చదివించుకుంటున్నారాయే.ప్రస్తుతం నార్త్ భామల ఆలోచన అలానే ఉంది. మెయిన్ గా టాలీవుడ్ స్టార్ హీరోలంటే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. ఇటీవల భరత్ అనే నేను సినిమాతో కైరా అద్వానీ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ రామ్ చరణ్ తో కూడా ఆ బ్యూటీ అవకాశం అందుకుంది. ఇక నెక్స్ట్ నిధి అగర్వాల్ కూడా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ అవ్వడానికి ట్రై చేస్తోంది. నెక్స్ట్ అఖిల్ తో కూడా ఓ సినిమా కోసం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య సవ్యాసాచి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తోంది. రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటూ తెలుగు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ప్రభాస్ కూడా ఆమెకు స్పెషల్ కోచింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ బ్యూటీకి కూడా మరికొన్ని అవకాశాలు అందే చాన్స్ ఉన్నట్లు టాక్.

ఒకప్పుడు సిమ్రాన్ నుండి భూమిక వరకు.. ఆర్తి అగర్వాల్ నుండి గజాలా వరకు.. అన్నీముంబయ్ సరుకులే. బాలీవుడ్ సొగసులే. హీందీ వాసనలే. ఆ తరువాత ట్రెండ్ మారి.. తమిళ్ అండ్ మల్లూ బ్యూటీస్ కాస్త పెత్తనం చలాయించారు. ఇప్పుడు మరోసారి ముంబయ్ భామలు సత్తా చాటుతున్నారు. వీరి రాకతో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గుతాయని చెప్పాలి. మరి వీరిలాగానే ఇంకెంతమంది ఎంట్రీ ఇస్తారో చూడాలి.