Begin typing your search above and press return to search.

భార్యకు రెడ్ హ్యాండెడ్ గా బాలీవుడ్ హీరో బుక్..!?

By:  Tupaki Desk   |   30 Nov 2015 3:58 AM GMT
భార్యకు రెడ్ హ్యాండెడ్ గా బాలీవుడ్ హీరో బుక్..!?
X
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడో చిత్రమైన అంశం ఒకటి షికార్లు చేస్తోంది. ఊహించని విధంగా ఒక బాలీవుడ్ హీరో.. తాను నటిస్తున్న చిత్రానికి సంబంధించిన సహ నటితో రహస్యంగా రొమాన్స్ చేస్తున్న సమయంలో.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయినట్లుగా చెబుతున్నారు. సంచలనం కలిగిస్తున్న ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఫెయిర్ నెస్ క్రీముల హీరోగా పేరున్న నటుడు ఒకరు.. ఈ మధ్యన చిత్ర షూటింగ్ లో భాగంగా సదూరాన ఉన్న హిల్ స్టేషన్ కు వెళ్లారట. ఆ సమయంలో హీరోగారి వ్యానిటీ వ్యాన్ లో సహ నటితో.. డీప్ రొమాన్స్ లో ఉన్నారట. అయితే.. ఇవేమీ తెలీని అతగాడి సతీమణి.. దూరాన ఉన్న భర్తను చూసేందుకు వచ్చిందట. సర్ ప్రైజ్ చేసేందుకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. షాక్ ఇవ్వాలని అనుకున్న ఆమె.. షూటింగ్ స్పాట్ లో వ్యాన్ లోకి వెళ్లి షాక్ తిన్నదట.

భర్తగారి భాగోతంతో దిమ్మ తిరిగిపోయిన ఆమెకు.. అతగాడితో కలిసి ఉండటానికి ససేమిరా అన్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ పరిశ్రమలో ఇప్పుడీ వ్యవహారం పలువురు నోట నానుతోంది. దీనికి గురించి కొన్ని మీడియా సంస్థలు సంచలన కథనాలు అందిస్తుండటం గమనార్హం.